Google : ఎన్నో విషయాలను అందించే గూగుల్ కు ప్రతి రోజు థాంక్యూ చెప్పుకోవాల్సిందే. తెలియని ఎన్నో విషయాలను ఏ నిమిషంలో అయినా అలుపు సొలుపు లేకుండా అందిస్తుంది. అందుకే చాలా మంది గూగుల్ తల్లి అని గౌరవిస్తుంటారు. మరి మీరు కూడా ఎన్నో విషయాలు ఈ గూగుల్ ద్వారా తెలుసుకున్నారు. అవును చెప్ ఛాంపియన్ కూడా మన తెలుగు అబ్బాయి అని కూడా ఈ గూగుల్ తెలిపింది కదా. అయితే గూగుల్ ప్రతి సారి తన డూడుల్ ను గమ్ముత్తుగా చేస్తుంటుంది. కొన్ని సార్లు బొమ్మలు, కొన్ని సార్లు ఉమెన్ ఫేస్, కొన్ని సార్లు రైతు ఇలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తుంటుంది. మరి ఈ సారి ఏం ప్లాన్ చేసింది అనుకుంటున్నారా?
దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటున్న ‘వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్’ విజయం గురించి మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది. ఈ విజయాన్ని ‘గూగుల్’ తనదైన శైలిలో జరుపుకుంది. తన డూడుల్‌ను చెస్ కాయిన్స్‌గా మార్చేసి మరీ సెలబ్రేట్ చేసుకుంది. ‘64 నలుపు & తెలుపు చతురస్రాల్లో ఇద్దరు ఆటగాళ్లు ఆడిన వ్యూహాత్మక గేమ్‌ను తెలియజేసేలా ఆ సంస్థ డూడుల్ ను రూపొందించింది. గుర్రం, రాజు, కాయిన్స్ అంటూ అవి మారుతూనే ఉన్నాయి. మరి మీలో ఎంత మంది ఈ తేడాను గమనించారు. మర్చిపోతే ఓ సారి గూగుల్ చేయండి బాస్ ఎందుకు టెన్షన్.
ప్రపంచ చదరంగంలో మరో శకం మొదలైందనే చెప్పాలి. దీనికి కారణం లేకపోలేదండోయ్. 18 ఏళ్ళ వయసులోనే వరల్డ్ చెస్ ను శాసిస్తున్నాడు ఇప్పటి విజేత. ఇంతకీ ఆయన ఎవరు అంటే భారత్ కు చెందిన గుకేశ్ దొమ్మరాజు. ఈ యువ సంచలనం సృష్టించాడు. వరల్డ్ చెస్ ఛాంపియన్ గా నిలిచి చరిత్రనే సృష్టించాడు. చాలా చిన్న వయసులోనే విశ్వవిజేతగా నిలవడం గమనార్హం. ఇలా చెస్ ప్లేయర్ గా రికార్డులకెక్కాడం ఆనందకరం. రసవత్తరంగా సాగిన టైటిల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్, చైనాకు చెందిన డింగ్ లిరెన్ పై విజయం సాధించి భారత ఖ్యాతిని పెంపొందించాడు. 14వ రౌండ్‌లో కూడా ఇద్దరూ హోరాహోరీగా తలపడటంతో ఎంతో మంది ఉత్కంఠభరితంగా ఎదురుచూశారు. కానీ ప్రత్యర్థిని కీలక సమయంలో తనదైన ఎత్తులతో కట్టిపెట్టి విజయం సాధించాడు గుకేష్. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్‌ను సొంతం చేసుకున్న రెండో భారత ఆటగాడిగా ఈయనే.
గుకేశ్ కెరీర్ సంచలనాల మయమే అని చెప్పాలి. ఎందుకంటే ఏడేళ్ళ వయసులో చెస్ ఆడడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి చిన్న వయసులో భారత గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపు పొందాడు. ఆ తర్వాత వరుస విజయాలతో వరల్డ్ చాంపియన్ గా నిలిచాడు. ఈ కుర్రాడు చెన్నైకి చెందిన వ్యక్తి. ఇటీవలే ప్రతిష్ఠాత్మక వరల్డ్ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో చాంపియన్‌గా నిలిచాడు. తనకంటే ఎంతో బలమైన, అనుభవజ్ఞులైన గ్రాండ్‌మాస్టర్లతో తలపడ్డాడు. ఇలా క్యాండిడేట్స్‌తో విజేతగా నిలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు.