Iphone : ధర ఎంతయినా సరే ఆపిల్ ఐఫోన్ అంటే చాలామందికి పిచ్చి. కొత్త మోడల్ వస్తే కొనడానికి అస్సలు వెనకాడరు. కానీ ప్రో మాక్స్ లాంటి మోడల్స్ కొనేముందు మాత్రం కాస్త ఆలోచించాలి. కంపెనీ లేటెస్ట్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ విషయానికొస్తే, ఈ ఫోన్‌లోని ప్రతి పార్ట్ చాలా అంటే చాలా ఖరీదైనది. ఒకవేళ మీరు ఈ మోడల్ వాడుతుంటే మాత్రం మీ ఫోన్‌ను చాలా జాగ్రత్తగా వాడుకోవాలి సుమా!
కొన్నిసార్లు మన చేతిలోంచి ఫోన్ జారి కిందపడి స్క్రీన్ పగిలిపోతుంది. కానీ ఒకవేళ మీ ఐఫోన్ 16 ప్రో మాక్స్‌కు అలా జరిగితే మాత్రం మీకు భారీ నష్టం వాటిల్లుతుంది. ఈ ఫోన్ ఫ్రంట్ స్క్రీన్‌ను మార్చడానికి కంపెనీ మీ నుంచి ఎంత డబ్బు వసూలు చేస్తుందో తెలుసా? కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఏ పార్ట్ ఎంత ధరకు ఉంటుందో ఈ కథనంలో తెలసుకుందాం.
Also Read : భారత్ లో ఐఫోన్ ధర రూ.2 లక్షలు? కారణం ఇదే
iPhone 16 Pro Max స్క్రీన్ మార్చే ఖర్చు
ఈ ఫోన్ స్క్రీన్ ఎంత ధరకు వస్తుందో తెలుసుకోవడానికి మీరు https://support.apple.com/en-in/iphone/repair లింక్‌ను సందర్శించవచ్చు. ఈ లింక్‌లోకి వెళ్లిన తర్వాత కొంచెం కిందకు స్క్రోల్ చేస్తే ఎస్టిమేట్ కాలిక్యులేటర్ కనిపిస్తుంది. పార్ట్ ధర తెలుసుకోవడానికి ఈ కాలిక్యులేటర్ మీకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వివరాలను అడుగుతుంది.
ఎస్టిమేట్ కాలిక్యులేటర్ స్క్రీన్ మార్చడానికి ఎంత ఖర్చవుతుందో ఒక అంచనాను మీకు తెలియజేస్తుంది. ధరలో మార్పులు ఉండవచ్చు, సర్వీస్ సెంటర్‌లో ఫోన్ ఇవ్వడానికి ముందు స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఖర్చు గురించి సరిగ్గా తెలుసుకోండి.
ఉదాహరణ: ఎస్టిమేట్ కాలిక్యులేటర్‌లో సర్వీస్ టైప్‌లో ‘క్రాక్డ్ స్క్రీన్’ ఆప్షన్ ఎంచుకోండి, ప్రొడక్ట్‌లో ‘ఐఫోన్ 16’ ఎంచుకోండి, ఆ తర్వాత మోడల్‌లో ‘ఐఫోన్ 16 ప్రో మాక్స్’ ఎంచుకోండి. వివరాలు చెప్పిన తర్వాత ‘గెట్ ఎస్టిమేట్’పై క్లిక్ చేస్తే స్క్రీన్ మార్చడానికి ఎంత ఖర్చవుతుందో తెలుస్తుంది. ఎస్టిమేట్ కాలిక్యులేటర్ ప్రకారం, ఐఫోన్ 16 ప్రో మాక్స్ స్క్రీన్ మార్చడానికి రూ.37,900 వరకు ఖర్చు అవుతుంది.
ప్రస్తుత ధరల విషయానికొస్తే, ఈ ఫోన్ యొక్క 256 జీబీ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 1,35,900కు, 512 జీబీ వేరియంట్ రూ.1,55,900కు, 1 టీబీ వేరియంట్ రూ.1,75,900కు అమ్ముడవుతోంది. మరోవైపు అమెజాన్‌లో 256 జీబీ వేరియంట్ అందుబాటులో లేదు, 512 జీబీ వేరియంట్ రూ. 1,55,900కు, 1 టీబీ మోడల్ రూ. 1,72,900కు అమ్ముడవుతోంది.
Also Read : అతి తక్కువ ధరలో ఐఫోన్ కావాలా.. ఇదే బెస్ట్ఛాన్స్.. ఐఫోన్ 16ఈని రిలీజ్ చేసిన యాపిల్