Manchu Manoj : కొంత కాలంగా మంచు ఫ్యామిలీ డ్రామా వారి అభిమానులకే మాత్రమే కాకుండా రెండు రాష్ట్రాల ప్రజలను ఏ మేరకు రక్తి కట్టిస్తుందో తెలిసిందే. డైలీ సీరియల్ మాదిరిగా రోజుకో ట్విస్టులతో ఆసక్తికరంగా సాగుతోంది. మనోజ్ కి తన అన్న విష్ణుకి మధ్య ఆస్తి పంపకాల్లో ఏవో వివాదాలు ఉన్నాయి. వారి తండ్రి మోహన్ బాబు విష్ణు వైపు ఉన్నారు. ఈ ఇష్యూ బయట ప్రపంచానికి ఇలానే తెలిసిపోయింది. తన ఇంటి దగ్గర జరిగిన గొడవలో ఓ రిపోర్టర్ ని కొట్టి ఏకంగా సుప్రీం కోర్టు మెట్లు ఎక్కి మరీ ముందస్తు బెయిల్ తెచ్చుకునే పరిస్థితి మోహన్ బాబుకు వచ్చింది. ఆ తర్వాత మోహన్ బాబు కాస్త సైలెంట్ అయిపోయారు. కానీ మనోజ్, విష్ణులు మాత్రం ఒకరినొకరు ట్విట్టర్ లో ర్యాగింగ్ చేసుకుంటున్నారు. కొద్ది రోజులుగా విష్ణు కూడా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మనోజ్ మాత్రమే ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నాను అంటూ తిరుగుతున్నారు.
ఎప్పటికప్పుడు మీడియాకు ఏదో ఒక విధంగా ఈ వివాదంపై అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నాడు. తాజాగా ఓ వీడియో వదిలాడు. ఢిల్లీ, హైదరాబాద్, తిరుపతిలో కోట్లు రూపాయలు ఇచ్చి వారి మనుషులతో తనని ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ మళ్లీ తన తండ్రి, అన్నలపై ఆరోపణలు చేశాడు మనోజ్.తన పై బోగస్ కేసులు పెట్టారని, బౌన్సర్లతో స్టూడెంట్లపై దాడి చేయిస్తున్నారని, రిసార్ట్స్‌లో రాబోయే సినిమా గురించి చర్చిస్తుంటే పోలీసులు వచ్చి తనను ఇబ్బందులకు గురి చేశారన్నారని, సోమవారం రాత్రి తన విషయంలో జరిగిన ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని, తన దగ్గర ఉన్నటు వంటి ఆధారాలను ఎస్పీకి అందజేస్తానని చెప్పుకొచ్చారు.
తాను చేస్తున్న పోరాటాన్ని పక్కదారి పట్టించేందుకు పలు రకాలుగా తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. ఇన్ని చేస్తుంటే తను భయపడుతున్నానని అనుకుంటున్నారని .. అది జరగదని ఓ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇది పూర్తిగా కుటుంబ వివాదాలని అందరికీ తెలుసు. ఇప్పుడు కేవలం మనోజ్ ఒక్కడే ఈ విషయంలో తరుచూ మీడియా ముందు కనిపిస్తుంటారు. గతంతో పోలిస్తే ఈ విషయంలో మీడియా ఆసక్తి కూడా తగ్గిపోయింది. వాస్తవానికి ఇందుకు కారణం కూడా ఆయనే.
మనోజ్ ప్రతిసారి పోరాటం, ఆధారాలు ఉన్నాయి అంటున్నారు కానీ అవేంటో ఇప్పటి వరకు బయటకు తేలేదు. తన ఆత్మ గౌరవ పోరాటం ఎందుకు చేస్తున్నారో స్పష్టంగా చెప్పరు.మోహన్ బాబు యూనివర్శిటీలో అక్రమాలు జరుగుతున్నాయని అంటున్నారు.. కానీ ఆధారాలు చూపించరు. నష్టపోతున్న విద్యార్థులను తీసుకొచ్చి మీడియా ముందు అక్రమాలు, అన్యాయాలు ఏంటో చెబితే తాను చేస్తున్న పోరాటానికి కాస్తో కూస్తో మద్దతు లభించవచ్చు. ఎంత సేపటికి ఏదో తన మీదే మీడియా ఫోకస్ ఉండాలని అనుకున్నట్లు ఆరోపణలు చేస్తుండడం సరికాదని కొందరి వాదన.
నిజానికి మనోజ్ దగ్గరఆధారాలే ఉండొచ్చు. ఆయన చెప్పినట్లు అది ఆయన ఆత్మగౌరవానికి సంబధించిన పోరాటం చేయనూ వచ్చచు. ఆస్తులు, పంపకాలు అవన్నీ వ్యక్తిగత విషయాలు. మొత్తం వ్యవహారాన్ని బయటపెట్టడానికి ధైర్యం మనోజ్ లో ఉన్నట్లు కనిపించడం లేదు. ఆయన వెర్షన్ ఎప్పుడూ రాజీ చేసుకుందాం అన్నట్లే వుంటుంది. మనోజ్ ప్రతిసారి ఇలా మీడియా ముందుకు వచ్చి తనను ఏదో చేస్తున్నారని ఆవేదన, ఆరోపణలు చేయడం తనను తాను పలుచన చేసుకోవడం అవుతుందని కొందరు అంటున్నారు.