Manchu Manoj: తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో మంచు మనోజ్. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసుడిగా బాల నటుడిగానే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మనోజ్. నేను మీకు తెలుసా, ప్రయాణం, వేదం, ‘బిందాస్’, ‘మిస్టర్ నూకయ్య’, పోటుగాడు, కరెంట్ తీగ, ‘ఒక్కడు మిగిలాడు’ మంచి విజయాల్ని సాధించాయి. ఆయన హీరోగా నటించిన చివరి సినిమా గుంటూరోడు 2017 లో విడుదలైంది. ఈ సినిమా విడుదలై దాదాపు నాలుగేళ్లు అవుతోంది.
ఇటీవల కాలంలో ఆయన పలు వ్యక్తిగత కారణాల రీత్యా సినిమాలకు గ్యాప్ ఇచ్చినప్పటికి… పలు కార్యక్రమాల ద్వారా ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. మంచు మనోజ్ ఆయన భార్య ప్రణతి విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలో మనోజ్ ఓ ఫారెన్ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని… ఆమెనే రెండో పెళ్లి చేసుకుంటాడని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. మోహన్ బాబు ఫ్యామిలీకి సమీప బంధువుల అమ్మాయిని మనోజ్ కి ఇచ్చి వివాహం చేయబోతున్నట్లు కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
https://t.co/HntEosyeYv please invite me too … where is the wedding and who is that Bujji pilla Thella pilla ?! 😜😂 me istam ra anthaaa me istam 🤪 pic.twitter.com/q8nKADpxxf
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 26, 2021
మంచు మనోజ్ తన రెండో పెళ్లి గురించి రాసిన వార్తను షేర్ చేస్తూ… దయచేసి నన్ను కూడా పిలవండి, పెళ్లి ఎక్కడ… ఇంతకీ ఆ బుజ్జి పిల్ల, తెల్ల పిల్ల ఎవరు… అంటూ సెటైర్స్ వేశారు. ‘మీ ఇష్టంరా అంతా మీ ఇష్టం’ అంటూ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మనోజ్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Manchu manoj setairical tweet on news about his second marriage
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com