Manchu Manoj : మంచు మోహన్ బాబు కుటుంబం లో ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడే హీరో మంచు మనోజ్(Manchu Manoj). ఇటీవల కాలం లో మనోజ్ సినిమాల్లో కంటే ఎక్కువగా వివాదాల్లోనే కనిపిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. సినిమాల్లో మంచి స్థానంలో ఉన్నప్పుడే మానసికంగా కొన్ని ఒత్తిడులు ఎదురుకోవడం వల్ల దూరమయ్యాడు. ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. తేజ సజ్జ(Teja Sajja) హీరో గా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘మిరాయ్'(Mirai Movie) లో విలన్ గా నటిస్తున్న మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్ హీరో గా నటిస్తున్న ‘భైరవం’ చిత్రం లో కూడా విలన్ గా నటిస్తున్నాడు. హీరో గా సక్సెస్ లను అందుకునే సత్తా ఉన్నప్పట్టికీ, మనోజ్ ఇలాంటి రోల్స్ వేయడం పై ఆయన్ని ఇష్టపడే అభిమానులు తప్పుబట్టారు. ఇక కేవలం విలన్ రోల్స్ కి పరిమితం అవుతాడేమో అని అనుకున్నారు.
Also Read : మోహన్ బాబు ఇంటి గేట్ ముందు ధర్నా కి దిగిన మంచు మనోజ్..వీడియో వైరల్!
కానీ ఆయన హీరో గా కూడా సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. రీసెంట్ గానే ఆయన 90ML మూవీ డైరెక్టర్ శేఖర్ రెడ్డి తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రానికి అత్తరు సాయిబు అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. కామెడీ జానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. మన అందరికీ తెలిసిందే మనోజ్ కామెడీ ని ఏ రేంజ్ లో పండిస్తాడు అనే విషయం. సినిమాలో కంటెంట్ ఉన్నా లేకపోయినా తన కామెడీ టైమింగ్ తో నవ్వు రప్పించగల సత్తా మనోజ్ కి ఉంది. అందుకే ఈ జానర్ ని ఎంచుకున్నాడు. ఒకప్పుడు మనోజ్ సినిమాల్లో పాటలు కూడా అద్భుతంగా ఉండేవి. ఇప్పుడు ఆయన చేయబోతున్న ఈ ‘అత్తరు సాయిబు’ చిత్రంలోని పాటలు కూడా తన వింటేజ్ మూవీస్ ని గుర్తు చేసే విధంగా ఉండాలని ప్లాన్ చేసుకున్నాడు మనోజ్. ఈ సినిమాకు నిర్మాత ఎవరు, సంగీత దర్శకుడు ఎవరు అనేది త్వరలోనే తెలియనుంది.
ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఈ చిత్రం ఉంది. ఈ చిత్రానికి ముందు మనోజ్ హీరో గా ‘వాట్ ది ఫిష్’, ‘అహం బ్రహ్మాస్మి’ చిత్రాలను మొదలు పెట్టాడు మనోజ్. కానీ ఎందుకో ఆయన ఆ చిత్రాలను ముందుకు తీసుకెళ్లలేకపోయాడు. ఇప్పుడు ఈ చిత్రం అయినా ముందుకెళ్తుందా?, లేకపోతే ఆ రెండు సినిమాలు లాగానే మధ్యలో ఆగిపోతుందా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఆయన నటించిన ‘భైరవం’ చిత్రాన్ని ఏప్రిల్ నెలలో తన సోదరుడు విష్ణు ‘కన్నప్ప’ కి పోటీ గా దింపాలని చూశాడు. కానీ ‘కన్నప్ప’ చిత్రం కొన్ని కారణాల వల్ల వాయిదా పడడంతో , భైరవం చిత్రాన్ని కూడా వాయిదా వేశారు. ఇప్పుడు ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుంది అనే దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.
Also Read : ఫ్యామిలీ తగాదాల పై ఎట్టకేలకు అసలు నిజాలు బయటపెట్టిన మంచు మనోజ్.. ఇంత జరిగిందా !