Pawan Kalyan : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సినిమాలకు ఇక నుండి ఓటీటీ సమస్యలు తప్పేలా లేవు. ఎందుకంటే ఓటీటీ లో డీలింగ్ చేసుకున్న తర్వాత చెప్పిన సమయానికి సినిమాని విడుదల చేయాలి, లేకపోతే వాళ్ళు డీల్ ని రద్దు చేసుకోవడమో, లేకపోతే ప్రైజ్ ని సగానికి తగ్గించడంలో చేస్తారు. ఎంత పెద్ద సూపర్ స్టార్ ని అయినా ఈ ఓటీటీ సంస్థలు లెక్క చేసే పరిస్థితిలో లేవు. ఒక ఉదాహరణ తీసుకుంటే, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటిస్తున్న ‘పెద్ది'(Peddi Movie) మూవీ షూటింగ్ అక్టోబర్ లోపు పూర్తి అయిపోతుంది. ఈ ఏడాది లోనే ఆ చిత్రాన్ని విడుదల చేయొచ్చు. కానీ నెట్ ఫ్లిక్స్ సంస్థకు ఈ ఏడాది ఎలాంటి స్లాట్స్ కాళీ లేవు. దీంతో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది స్లాట్ లో అమ్మేశారు. ఫలితంగా సినిమా కూడా వచ్చే ఏడాదికి పోస్ట్ పోనే అయ్యింది.
Also Read : ఉస్తాద్ భగత్ సింగ్ మీద అంచనాలు తగ్గిపోతున్నాయా..? కారణం ఏంటి..?
ఇలా ఉంటాయి ఓటీటీ సంస్థల లెక్కలు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే, ఎప్పుడు మొదలు అవుతాయో తెలియదు, ఎప్పుడు పూర్తి అవుతాయో తెలీదు. ఈలోపు నిర్మాతలు సైలెంట్ గా ఉండరు కదా?, ఓటీటీ రైట్స్ ని అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత వాళ్ళు చెప్పిన విడుదల తేదికి కచ్చితంగా వచ్చేయాలి. ఒకటి రెండు సార్లు వాయిదా పడినా ఓర్చుకుంటారు. కానీ అసలు సినిమా వస్తుందా లేదా అనే పరిస్థితి ఉంటే వాళ్లేందుకు డీల్ ని కొనసాగిస్తారు చెప్పండి?, ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్”(Ustaad Bhagat Singh) మూవీ పరిస్థితి కూడా అదే. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ ని భారీ రేట్ కి 2023వ సంవత్సరం లోనే నిర్మాతలు అమెజాన్ ప్రైమ్(Amazon Prime Video) సంస్థకు అమ్మేశారు. అప్పటికి సినిమా కేవలం 20 శాతం మాత్రమే పూర్తి అయ్యింది. డిజిటల్ రైట్స్ ని అమ్మిన తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. దాదాపుగా ఏడాదికి పైగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.
దీంతో అమెజాన్ ప్రైమ్ కి ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతుంది అనే నమ్మకం లేదు. అందుకే డీల్ ని రద్దు చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే సంస్థ ‘హరి హర వీరమల్లు’ సినిమాని కూడా కొనుగోలు చేసింది. ఈ సినిమా ఎన్నిసార్లు వాయిదా పడుతూ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మే9 న కూడా విడుదల అవ్వదు అని తెలియడం తో ఈ నెల విడుదల కాకుంటే డీల్ ని రద్దు చేసుకుంటాము అని వార్నింగ్ ఇచ్చింది. ఈ విషయం పవన్ కళ్యాణ్ వరకు వెళ్లడం తో రీసెంట్ గానే షూటింగ్ ని పూర్తి చేసాడు. ఈ నెలాఖరున కానీ, లేదా జూన్ 12న కానీ ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు కూడా డేట్స్ ని కేటాయించాడు అని టాక్ ఉంది. జూన్ నుండి 50 రోజుల పాటు నాన్ స్టాప్ గా ఈ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.
Also Read : పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూట్ లో పాల్గొనేది అప్పుడేనా..?