Suriya : సినీ హీరోలు కానీ, రాజకీయ నాయకులూ కానీ వాళ్ళ జీవితం లో నేడు అనుభవిస్తున్న లగ్జరీ లైఫ్ కి కారణం అభిమానులే. అభిమానులు టికెట్ కొని సినిమాకు వెళ్లి చూస్తేనే సినీ హీరోలు నేడు ఈ స్థాయిలో ఉంటున్నారు. తమని ఈ స్థాయిలో కూర్చోబెట్టిన వాళ్లకు ఎదో ఒకటి చేసి రుణం తీర్చుకోవాలి అనే గొప్ప మనసు అందరికీ ఉండదు, కేవలం కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఆ కొంతమందిలో ఒకరు తమిళ హీరో సూర్య(Suriya Sivakumar). ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు, సహాయం చేయాలనే మనసుంటే ఎలా అయినా చేయొచ్చు అని నిరూపించిన అతి తక్కువ మందిలో ఒకరు సూర్య. ఇప్పటికే ఆయన ‘అగారం’ అనే ఫౌండేషన్ ని స్థాపించి, ఎంతో మంది పేద విద్యార్థులను చదివించి గొప్ప మనసుని చాటుకున్నాడు. ఇప్పుడు రీసెంట్ గా ఆయన చిన్న పిల్లల చదువు కోసం పది కోట్ల రూపాయిలు విరాళం అందించి మరోసారి తన గొప్ప మనసుని చాటుకున్నాడు.
Aslo Read: విశ్వంభర సినిమాలో త్రిష కు పోటీగా మరో స్టార్ హీరోయిన్
పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే ఆయన హీరో గా నటించిన ‘రెట్రో'(Retro Movie) చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయినప్పటికీ కూడా ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి వసూళ్లు వస్తున్నాయి. రోజువారీ వసూళ్లు చాలా స్టడీ గా ఉన్నాయి. ఈ చిత్రానికి నిర్మాత సూర్య నే కావడం తో తన సినిమాకు వచ్చిన లాభాల్లో కొంత తన ‘అగారం’ ఫౌండేషన్ కి పది కోట్ల రూపాయిలు అందించాడు. ఆయనతో పాటు ‘రెట్రో’ చిత్ర దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కూడా వచ్చాడు. ఇద్దరు కలిసి తమ చేతుల మీదుగా పది కోట్ల రూపాయిలను నిర్వాహకులకు అందించారు. పది కోట్ల రూపాయిలు అంటే చిన్న విషయం కాదు, ఒక లక్ష రూపాయిలు బయటకు తీయడానికే ఇబ్బంది పడుతున్న సెలబ్రిటీలు ఉన్న రోజులివి.
అలాంటివి పది కోట్ల రూపాయిలు కేవలం పిల్లల చదువు కోసం ఉపయోగించాడు అంటే సూర్య మనసు ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. ఆయన వల్ల ఇలా ఇప్పటి వరకు ఎంత మంది పేద విద్యార్థులు చదువుకొని పెద్ద స్థాయికి వెళ్లారో లెక్కే లేదు. ఎంత మంది జీవితాలు బాగుపడ్డాయి మీరే ఊహించుకోండి. ఇలాంటి అత్యున్నత బావాలు గల హీరోలు ప్రతీ ఇండస్ట్రీ లో ఉంటే, దేశం లో చదువులేని విద్యార్థి ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇకపోతే ‘రెట్రో’ తర్వాత హీరో సూర్య మన తెలుగు లో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘లక్కీ భాస్కర్’ డైరెక్టర్ వెంకీ అట్లూరి తో కలిసి ఆయన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. వరుస ఫ్లాప్స్ ని ఎదురుకుంటున్న సూర్య ఈ సినిమాతో భారీ కం బ్యాక్ ఇస్తాడనే నమ్మకం ఆడియన్స్ లో బలంగా ఉంది.
Aslo Read: నితిన్ ‘ఎల్లమ్మ’ నుండి సాయి పల్లవి అవుట్..కారణం ఏమిటంటే!