https://oktelugu.com/

Ram Charan: రామ్ చరణ్ ఇంట్లో రహస్యంగా కాపురం చేసిన మంచు లక్ష్మి.. ఎవరికీ చెప్పొద్దని రిక్వెస్ట్!

Ram Charan: ఏ ఒక్క రంగంలో మంచు లక్ష్మి స్టార్ కాలేకపోయారు. దానికి తోడు విపరీతమైన ట్రోల్స్. మంచు లక్ష్మి మాట తీరు, బిహేవియర్ తరచుగా ట్రోల్స్ కి గురవుతూ ఉంటాయి. మంచు లక్ష్మి అవేమీ పట్టించుకోదు.

Written By:
  • S Reddy
  • , Updated On : July 1, 2024 / 10:30 AM IST

    Manchu Lakshmi Staying In Ram Charan House in Mumbai

    Follow us on

    Ram Charan: మంచు లక్ష్మి ప్రస్తుతం ముంబైలో ఉంటుంది. ఆమె టాలీవుడ్ కి గుడ్ బై చెప్పింది. అమెరికాలో మంచు లక్ష్మి కెరీర్ మొదలైంది. ఆమె అక్కడ కొన్ని టెలివిజన్ షోలు చేశారు. హోస్ట్ గా వ్యవహరించారు. అలాగే ఒకటి రెండు హాలీవుడ్ చిత్రాల్లో నటించారు. సడన్ గా యూఎస్ వదిలేసి ఇండియా వచ్చారు. నటిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. విలన్, హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేసింది. కొన్ని చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించింది. అయితే ఆమెకు బ్రేక్ రాలేదు.

    ఏ ఒక్క రంగంలో మంచు లక్ష్మి స్టార్ కాలేకపోయారు. దానికి తోడు విపరీతమైన ట్రోల్స్. మంచు లక్ష్మి మాట తీరు, బిహేవియర్ తరచుగా ట్రోల్స్ కి గురవుతూ ఉంటాయి. మంచు లక్ష్మి అవేమీ పట్టించుకోదు. ట్రోల్స్ పని లేని వాళ్ళు చేసే చర్యలు అంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతుంది. ఆ ధైర్యంతోనే మంచు లక్ష్మి మకాం ముంబై కి మార్చింది. టాలీవుడ్ లో సక్సెస్ కాలేకపోయిన మంచు లక్ష్మి బాలీవుడ్ లో ఏదో ఒకటి సాధించాలి అనుకుంటుంది.

    ఇక బాలీవుడ్ మీడియాకు ఆమె వరుస ఇంటర్వ్యూలు ఇవ్వడం విశేషం. తాజా ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి ఓ ఆసక్తికర విషయం బయటపెట్టింది. ఆమె రహస్యంగా కొన్నాళ్ళు రామ్ చరణ్ ఇంట్లో ఉన్నారట. ముంబైకి వచ్చిన కొత్తల్లో ఆమె ఇల్లు అద్దెకు తీసుకోలేదట. ముంబైలో ఉన్న రామ్ చరణ్ ఇంట్లో మంచు లక్ష్మి ఉన్నారట. అయితే ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని రామ్ చరణ్ ని మంచు లక్ష్మి రిక్వెస్ట్ చేసిందట. అందుకు కారణం… తను రామ్ చరణ్ గెస్ట్ అని తెలిస్తే ఎవరూ సహాయం చేయరట. రామ్ చరణ్ తెలుసు నీకు మా అవసరం ఏముంటుంది అంటారట.

    అందుకే రామ్ చరణ్ ని తన ఇంట్లో ఉంటున్న విషయం బయటపెట్టొద్దని మంచు లక్ష్మి కోరారట. నేను ఎందుకు చెబుతాను. నీకు ఇష్టం వచ్చినన్ని రోజులు ఉండు అని రామ్ చరణ్ అన్నారట. తాను ఎన్ని రోజులు రామ్ చరణ్ ఇంట్లో ఉన్నానో కూడా తనకు తెలియదని… మంచు లక్ష్మి అన్నారు. చరణ్ తో ఎవరికీ చెప్పొద్దని చెప్పి ఇప్పుడు నేనే చెప్పేశాను.. అని ఆమె నవ్వేశారు. రానా, రామ్ చరణ్, మంచు లక్ష్మి కలిసి పెరిగారు. వీరు మంచి ఫ్రెండ్స్. ఆ సాన్నిహిత్యంతో రామ్ చరణ్ తన ఇంట్లో ఆమెకు చోటు ఇచ్చారు. ప్రస్తుతం మంచు లక్ష్మి ముంబైలో ఓ లగ్జరీ హౌస్ అద్దెకు తీసుకుని ఉంటుంది.