Bangalore Rave Party : మంచు లక్ష్మి నటిస్తున్న సరికొత్త వెబ్ సిరీస్ ‘యక్షిణి ‘ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాహుబలి సినిమాను నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. తేజ మార్ని యక్షిణి సిరీస్ డైరెక్ట్ చేశారు. సోషియో ఫాంటసీ కథతో హార్రర్ ఎలిమెంట్స్ జతచేసి యక్షిణి తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన మంచు లక్ష్మి ఇటీవల సంచలనం రేపిన రేవ్ పార్టీ ఉదంతం పై స్పందించారు. బెంగళూరు రేవ్ పార్టీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ముంబైకి షిఫ్ట్ అవ్వడంతో నేను బాలీవుడ్ కి వెళ్లానని అందరూ భావించారు. అందులో నిజం లేదు. ముంబైలో ఉంటున్నాను అంతే. హైదరాబాద్ నా ఇల్లుతో సమానం. నా కెరీర్ కోసం, కూతురు భవిష్యత్తు కోసం ముంబై వెళ్ళాను అని ఆమె తెలిపారు.
‘ కన్నప్ప ‘లో తాను నటించడం లేదని, అవకాశం రాలేదని మంచు లక్ష్మి అన్నారు. తనకు సరిపోయే పాత్ర లేదేమో అందుకే ఛాన్స్ ఇవ్వలేదని వెల్లడించారు. రేవ్ పార్టీ పై మీ అభిప్రాయం ఏంటని విలేకర్లు ప్రశ్నించారు. దానికి మంచు లక్ష్మి తన స్టైల్ లో సమాధానం ఇచ్చారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఏం జరిగిందో నాకు తెలియదు. ఈ ప్రశ్న అడగడానికి ఇది సందర్భం కాదు. చాలా రోజుల తర్వాత నేను నటించిన వెబ్ సిరీస్ మీ ముందుకు రాబోతుంది.
దాని గురించి మాట్లాడుకుందాం. ఎవరో ఎక్కడికో వెళ్తే నాకేంటి సంబంధం. ఆ వ్యక్తులు, వాళ్ళ ప్రాబ్లమ్ అంతే.. అని ఆమె అన్నారు. నెగిటివ్ ట్రోలింగ్ పై స్పందిస్తూ నేను ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని. మీ బిడ్డని. పొలిటికల్ గా మాట్లాడటం నాకు రాదు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాం. కొందరు నన్ను ట్రోల్స్ చేయడం చూసి బాధేసేది అని ఆమె అన్నారు.