Mukesh Ambani : చిన్న కోడలుకు అంబానీ అదిరిపోయే గిఫ్ట్‌!

కాబోయే కోడలు రాధికా మర్చంట్కు ఖరీదైన వెండి గణపతి విగ్రహం, కలశాలుసహా పలు నగలు కానుకగా అందించారట. నీతా అంబానీ తన సొంత డైమండ్ నక్లెస్‌ను రాధికాకు బహుమతిగా అందించారు.

Written By: NARESH, Updated On : May 25, 2024 8:07 pm

Mukesh Ambani gifted a villa in Dubai to his daughter-in-law

Follow us on

Mukesh Ambani : అసియా సంపన్నుడు.. అపర కుబేరుడు.. రియల్స్‌ ఇండస్స్సీ్‌ అధినేత ముఖేశ్‌, నీతా అంబానీ దపంతులు తమ చిన్నకుమారుడు అనంత్‌అంబానీ-రాధికా మర్చంట్‌ నిశ్చితార్థం సందర్భంగా అనేక ఖరీదైన బహుమతులు ఇచ్చారు. తాజాగా నీతా అంబానీ తనకు కాబోయే చిన్న కోడలకు దుబాయ్‌లోని అద్భుతమైన లగ్జరీ విల్లాను బహుమతిగా అందించాలని నిర్ణయించారు. దీంతో విల్లా ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

రూ,640 కోట్ల విల్లా..
రిలయన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌గా, ఎన్‌ఎంఏసీసీ అధ్యక్షురాలిగా ఉన్న నీతా అంబానీ దుబాయ్‌లో రూ.640 కోట్ల విలువ చేసే విల్లాను తన కొత్త కోడలుకు గిఫ్ట్‌గా ఇవ్వనున్నారు. ఇందులో పది విలాసవంతమైన బెడ్‌రూంలు, అద్భుతమైన ఇంటీరియన్స్‌, ఇటాలియన్‌ మార్బుల్‌, అద్భుతమైన కళాకృతులు ఉన్నాయట. ఇందులో 70 మీటర్ల ప్రైవేట్ బీచ్ స్పెషల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందట. బిలియనీర్‌ ఫ్యామిలీ బస చేయడానికి, భారీ పార్టీలు చేసుకునేందుకు వీలు కూడా ఉంటుందని తెలుస్తోంది.

2022లో నిశ్చితార్థం..
లవ్‌ బర్డ్‌‍్స అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌ తమ ప్రేమను అధికారికంగా ప్రకటించి 2022లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇటీవల గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రీవెడ్డింగ్‌ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. హస్తాక్షర్ వేడుకలో తమ ప్రేమపై సంతకాలు కూడా చేశారు. ఇక రెండో విడత వేడుకలకు కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఏడాది జూలైలో ఏడడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఖరీదైన కారు గిఫ్ట్‌ ఇచ్చిన ముఖేశ్‌ అంబానీ..
ఇదిలా ఉంటే అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ నిశ్చితార్థం సందర్భంగా ముఖేశ్‌ అంబానీ తన కొడుకు అనంత్‌కు రూ.4.5 కోట్ల విలువైన బెంట్లీ కాంటినెంటల్ జీటీసీ స్పీడ్ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. కాబోయే కోడలు రాధికా మర్చంట్కు ఖరీదైన వెండి గణపతి విగ్రహం, కలశాలుసహా పలు నగలు కానుకగా అందించారట. నీతా అంబానీ తన సొంత డైమండ్ నక్లెస్‌ను రాధికాకు బహుమతిగా అందించారు.