https://oktelugu.com/

Manchu Lakshmi: రకుల్ ని పెళ్లి చేసుకునే ఛాన్స్ కోల్పోయిన మంచు లక్ష్మి… గుండె బద్దలైందంటూ ట్వీట్!

భారతదేశానికి ఓ సంస్కృతి ఉంది. వివాహ వ్యవస్థ అంటే సమాజంలో గౌరవం, విలువ ఉన్నాయి. ఈ అంశాలు దృష్టిలో పెట్టుకొని సుప్రీం కోర్ట్ కీలక తీర్పు వెలువరించింది. స్వలింగ వివాహాలు చట్ట విరుద్ధమని తీర్పు వెలువరించింది. ఈ తీర్పు పై మంచు లక్ష్మి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ మంచు లక్ష్మి ట్వీట్ చేసింది.

Written By:
  • NARESH
  • , Updated On : October 19, 2023 / 03:04 PM IST

    Manchu Lakshmi

    Follow us on

    Manchu Lakshmi: మంచు లక్ష్మి అమెరికాలో పెరిగింది. అక్కడే కెరీర్ స్టార్ట్ చేసింది. ఆమెపై పాశ్చాత్య సంస్కృతి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. మంచు లక్ష్మి లైఫ్ స్టైల్ అలానే ఉంటుంది. భర్త ఎక్కడో బిజినెస్ చేస్తూ తలమునకలై ఉంటారు. ఆమె హైదరాబాద్ లో కూతురితో పాటు ఒంటరిగా ఉంటుంది. కెరీర్, ఫ్రెండ్స్, పార్టీలు ఇదే జీవితం. వివాహ బంధానికి మంచు లక్ష్మి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరనే వాదన ఉంది. అమ్మాయిలంటే వంట గదికే పరిమితం కావాలా అంటుంది. కాగా ఆమె తాజా ట్వీట్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చురకలు అంటిస్తున్నారు.

    భారతదేశానికి ఓ సంస్కృతి ఉంది. వివాహ వ్యవస్థ అంటే సమాజంలో గౌరవం, విలువ ఉన్నాయి. ఈ అంశాలు దృష్టిలో పెట్టుకొని సుప్రీం కోర్ట్ కీలక తీర్పు వెలువరించింది. స్వలింగ వివాహాలు చట్ట విరుద్ధమని తీర్పు వెలువరించింది. ఈ తీర్పు పై మంచు లక్ష్మి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ మంచు లక్ష్మి ట్వీట్ చేసింది.

    సుప్రీంకోర్టు స్వలింగ వివాహాలు చట్టబద్దం చేయడం కుదరని తీర్పు ఇవ్వడంతో నా గుండె బద్దలైంది. నేను తీవ్ర నిరాశకు గురయ్యాను. ప్రపంచానికి ప్రేమను పరిచయం చేసిన దేశం స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించకపోవడం సిగ్గు చేటు… అంటూ ట్వీట్ చేసింది. అయితే మంచు లక్ష్మి ట్వీట్ పై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మన సంస్కృతి, సాంప్రదాయం, విలువలు దృష్టిలో ఉంచుకొని కోర్ట్ తీర్పు ఇచ్చింది. దీనికి మీరెందుకు బాధపడుతున్నారని ఎదురు ప్రశ్నిస్తున్నారు.

    మీకెంతుకు అంత బాధ. మీరు ఎవరినైనా అమ్మాయిని వివాహం చేసుకుందామని అనుకున్నారా? అని ఒక నెటిజెన్ కామెంట్ చేశారు. ఓ నెటిజెన్ అయితే… స్వలింగ వివాహం చట్టబద్ధం చేస్తే రకుల్ ప్రీత్ ని వివాహం చేసుకునేదానివా అంటూ కౌంటర్ వేశాడు. మంచు లక్ష్మికి ఓ లేడీ గ్యాంగ్ ఉంది. వారిలో రకుల్ ప్రీత్ ఆమెకు అత్యంత సన్నిహితం. ఈ క్రమంలో పెళ్ళైన మీరు పెళ్లి కాని రకుల్ ప్రీత్ ని వివాహం చేసుకుందాం అనుకున్నారా? అందుకే మీ గుండె బద్దలయ్యిందా అంటున్నారు.

    లక్ష్మి మంచు ట్వీట్ వైరల్ అవుతుంది. ఇక మంచు లక్ష్మి జయాపజయాలతో సంబంధం లేకుండా చిత్రాలు చేస్తుంది. ప్రస్తుతం అగ్ని నక్షత్రం టైటిల్ తో యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తి అయినట్లు సమాచారం. కారణం తెలియదు కానీ విడుదల చేయడం లేదు. అగ్ని నక్షత్రం చిత్రంలో మోహన్ బాబు కూడా కీలక రోల్ చేశాడు. మరోవైపు మంచు కుటుంబంలో విభేదాలు ఏర్పడ్డాయి. మనోజ్, లక్ష్మి ఒక వర్గం… విష్ణు మరొక వర్గంగా విడిపోయారు.