Homeఎంటర్టైన్మెంట్Manchu Lakshmi: నన్ను చూస్తే లేచి నిలుచుంటారు అంటూ మంచు లక్ష్మీ కామెంట్స్

Manchu Lakshmi: నన్ను చూస్తే లేచి నిలుచుంటారు అంటూ మంచు లక్ష్మీ కామెంట్స్

బుల్లితెరపై పలు షోలకు హోస్ట్ గా వ్యవహరించి యాంకర్ గా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది మంచు లక్ష్మి. మలయాళం లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Manchu Lakshmi: తెలుగు సినీ ప్రేక్షకులకు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమాలు, అందం కంటే లాంగ్వేజ్ తో మరింత పాపులర్ అయింది. ఇక మోహన్ బాబు కూతురుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించింది. అనగనగా ఒక ధీరుడు, గుండెల్లో గోదారి, చందమామ కథలు లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే అంతకంటే ముందే పలు అమెరికన్ టీవీ సిరీస్ లు చేసి మంచి గుర్తింపును తెచ్చుకుంది.

బుల్లితెరపై పలు షోలకు హోస్ట్ గా వ్యవహరించి యాంకర్ గా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది మంచు లక్ష్మి. మలయాళం లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. లెస్బియన్ గా నటించి క్రిటికల్ అప్లాజ్ అందుకుంది. సినిమాలలో నటించకపోయినా తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది మంచు లక్ష్మి. ముఖ్యంగా సోషల్ మీడియాలో తరచూ ట్రోలింగ్ కు కూడా గురవుతూ ఉంటుంది. అయితే ఈ మధ్యనే హైదరాబాద్ నుంచి ముంబై కి మకాం మార్చేసింది లక్ష్మీ

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మీ కి ఈ విషయం గురించి ఓ ప్రశ్న ఎదురైంది. దాంతో ఆ విషయంపై స్పందించిన ఈ అమ్మడు హైదరాబాద్ లో నన్ను చూసి అందరూ లేచి నిల్చుంటారు. ఇక్కడ నేను పరిచయం చేసుకోవాలి. పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేయాలంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇది విన్న నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయినా మంచు ఫ్యామిలీని ఇక్కడ ఎవరు పట్టించుకున్నారు? అక్కడ అంత బిల్డప్ ఇస్తున్నావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. తమరు పక్క నుంచి వెళ్లినా ఒక్కరు కూడా సెల్ఫీ అడగరు. అలాంటిది లేచి మరీ రెస్పెక్ట్ ఇస్తారా అంటూ మండి పడుతున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper