https://oktelugu.com/

Manchu Lakshmi : బెట్టింగ్ యాప్స్ ప్రచారంలో మంచు లక్ష్మి..అడ్డంగా దొరికిపోయిందిగా!

Manchu Lakshmi : ఒకప్పుడు బెట్టింగ్ యాప్స్ పేరుతో కోట్ల రూపాయిల డబ్బులను పోగు చేసుకునే సెలబ్రిటీస్, ఇప్పుడు వాటి పేర్లు వింటేనే భయపడిపోతున్నారు.

Written By: , Updated On : March 20, 2025 / 08:15 AM IST
Manchu Lakshmi

Manchu Lakshmi

Follow us on

Manchu Lakshmi : ఒకప్పుడు బెట్టింగ్ యాప్స్ పేరుతో కోట్ల రూపాయిల డబ్బులను పోగు చేసుకునే సెలబ్రిటీస్, ఇప్పుడు వాటి పేర్లు వింటేనే భయపడిపోతున్నారు. కారణం VC సజ్జనార్. యువతని నాశనం చేస్తున్న ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే సెలబ్రిటీస్ పై ఆయన ఉక్కుపాదం మోపాడు. ఒకప్పుడు లక్షలాది మంది ఫాలోవర్స్ ఉండే టాప్ సెలెబ్రిటీలు సోషల్ మీడియా లో బెట్టింగ్ యాప్స్ ని విచ్చలవిడిగా ప్రమోట్ చేసేవారు. వీళ్ళ కారణంగా ఎంతో మంది అమాయకులు ప్రభావితమై లక్షల రూపాయిలను పోగొట్టుకున్నారు. ఇప్పటికీ ఈ దందా కొనసాగుతూనే ఉంది. బెట్టింగ్ యాప్స్ ని ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆపలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం బలమైన నిర్ణయం తీసుకునే వరకు ఇవి ఆగవు. కనీసం సెలబ్రిటీస్ వాటిపై పోకుండా ఉంటే చాలు, కానీ వాళ్ళే ప్రోత్సహిస్తున్నారు. బెట్టింగ్స్ యాప్స్ ని ప్రమోట్ చేయడం వల్ల వాళ్లకు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ అందుతుంది.

Also Read : అందుకే భర్తకు దూరంగా ఉంటున్నా.. ఎట్టకేలకు నోరు విప్పిన మంచు లక్ష్మి!

అందుకే సెలబ్రిటీస్ తప్పు అని తెలిసినప్పటికీ కూడా ప్రొమోషన్స్ ఆపకుండా చేస్తూ వచ్చారు. అయితే చిన్న సెలబ్రిటీస్ మీద మాత్రం యాక్షన్ తీసుకుంటారా..?, టాప్ సెలబ్రిటీస్ జోలికి వెళ్ళరా?, ఇదెక్కడి న్యాయం అంటూ కొంతమంది నెటిజెన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేసారు. సోషల్ మీడియా సెలబ్రిటీస్ ని మాత్రమే కాదు, ఎంత పెద్ద సెలబ్రిటీస్ పైన అయినా చర్యలు తీసుకుంటాము అంటూ పోలీసులు చెప్పడంతో గతంలో నిధి అగర్వాల్(Nidhi Agarwal), మంచు లక్ష్మి(Manchu Lakshmi) వంటి వారు పలు బెట్టింగ్ యాప్స్ కి ప్రచారం చేసిన వీడియో లను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసారు. పోలీసులు వీళ్లపై చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం ఈ ఇద్దరు హీరోయిన్స్ మాత్రమే కాదు, గతంలో కాజల్ అగర్వాల్(Kajal Agarwal), తమన్నా(Tamannaah Bhatia) వంటి వారు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వారే. సౌత్ లో టాప్ మోస్ట్ హీరోయిన్స్ అయిన వీళ్ళే ఇలా చేస్తున్నారంటే ఈ బెట్టింగ్ యాప్స్ మాఫియా నెట్వర్క్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఎంతటి వారిపై అయినా చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చిన పోలీసులు ఈ స్థాయి స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్స్ జోలికి వెళ్తారా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. గతంలో తమన్నా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ తీవ్రమైన విమర్శలను ఎదురుకుంది. అప్పట్లోనే ఆమెపై ఎవరైనా కేసు వేసి చర్యలు తీసుకొని ఉండుంటే, ఈరోజు ఇంత మంది సెలబ్రిటీస్ ఆ దారిలో వెళ్ళేవాళ్ళు కాదు, ఎంతోమంది అమాయకులు మోసపోయేవాళ్లు కూడా కాదు. కేవలం వార్నింగ్ ఇచ్చి వదిలేస్తే సరిపోదు. కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వార్నింగ్ ఇచ్చి వదిలేస్తే, వార్ణింగే కదా, ఇంకోసారి తీసుకుందాం ఏమి కాదు అనుకోని మళ్ళీ బెట్టింగ్స్ యాప్స్ వ్యాపారం జోరుగా చేసే అవకాశం ఉంది. చూడాలి మరి పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది.

Also Read : శ్రీదేవిని అలా చూసి షాక్ అయ్యాను… ఆసక్తికరంగా మంచు లక్ష్మి కామెంట్స్!