Manchu Family Ramayana Movie: మంచు విష్ణు(Manchu Vishnu) తన డ్రీం ప్రాజెక్ట్ గా భావించి ఎంతో కస్టపడి, ఎన్నో అడ్డంకులను ఎదురుకొని రీసెంట్ గానే ‘కన్నప్ప'(Kannappa Movie) చిత్రాన్ని నిర్మించి మన ముందుకు తీసుకొచ్చాడు. ఈ సినిమా కు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ భారీ బడ్జెట్ కావడంతో ఆ రేంజ్ వసూళ్లను మాత్రం రాబట్టలేకపోయింది. దీంతో నిర్మాతగా మంచు విష్ణు భారీ నష్టాలను చూడాల్సి వచ్చింది. కానీ ఈ సినిమాని తానూ డబ్బుల కోసం తియ్యలేదని, కేవలం శివ భక్తితో తీశానని, ఫలితం తో నాకు అసలు సంబంధం లేదని, అటు మంచు విష్ణు, ఇటు మోహన్ బాబు పలు ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉండగా మంచు విష్ణు కి మరో డ్రీం ప్రాజెక్ట్ కూడా ఉందట. అదే మన హిస్టారికల్ రామాయణం. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తమిళ హీరో సూర్య ని శ్రీ రాముడిగా పెట్టి తియ్యాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాడట.
Also Read: విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ టైటిల్ మార్పు..కొత్త టైటిల్ ఇదే..కారణం ఏంటంటే!
2009 వ సంవత్సరం లోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకు తీసుకొచ్చేందుకు మంచు విష్ణు గట్టి ప్రయత్నాలు చేసాడట. సూర్య(Surya Sivakumar) శ్రీ రాముడిగా, సీత దేవిగా అలియా భట్(Alia Bhatt), లక్ష్మణుడిగా నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram), ఇంద్ర జిత్ గా కార్తీ(Karthi Sivakumar), రావణుడిగా మోహన్ బాబు(Manchu Mohan Babu) ని పెట్టి ఈ సినిమాని చెయ్యాలి అనేది మంచు విష్ణు డ్రీం. కానీ అప్పటి బడ్జెట్ సహకరించకపోవడం తో ఆయన ఈ ఆలోచన ని విరమించుకున్నాడు. ప్రస్తుతం మంచు విష్ణు ద్రుష్టి ఈ క్రేజీ ప్రాజెక్ట్ వైపు వెళ్లిందని, త్వరలోనే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమాలో మంచు విష్ణు హనుమంతుడి క్యారక్టర్ చేయాలనీ అనుకుంటున్నాడట. సూర్య కి అటు తమిళం లో, ఇటు తెలుగు లో మంచి మార్కెట్ ఉంది కాబట్టి, కచ్చితంగా ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అయితే హిందీ లో రీసెంట్ గానే నితీష్ తివారీ భారీ బడ్జెట్ తో రామాయణం ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం లో రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తుండగా, రావణుడిగా కన్నడ స్టార్ హీరో యాష్, సీత గా సాయి పల్లవి, హనుమంతుడిగా సన్నీ డియోల్, సూర్పనక్క గా రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన చిన్న గ్లింప్స్ వీడియో ని రీసెంట్ గానే విడుదల చేయగా, అది బాగా వైరల్ అయ్యింది. కచ్చితంగా ఒక అద్భుతమైన దృశ్య కావ్యాన్ని వెండితెర పై చూడొచ్చు అనే ఫీలింగ్ ని ఈ చిత్రం కలిగించింది. అలాంటి సినిమా వచ్చిన తర్వాత మంచు విష్ణు రామాయణం ని ఆడియన్స్ ఎంత మేరకు పట్టించుకుంటారు అనేది చూడాలి.