Hari Hara Veera Mallu Pre Release Event: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులకు మరో నాలుగు రోజుల్లో ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం ద్వారా పెద్ద పండుగ రానుంది. ఈ చిత్రం కోసం వాళ్ళు సుమారుగా ఆరేళ్ళ నుండి ఎదురు చూస్తున్నారు. పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే సినిమాలకు మొదటి నుండి మన వద్ద మంచి ఆదరణ ఉంటుంది. అలాంటిది పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ ఆ జానర్ లో సినిమా తీస్తే ఎలా ఉంటుంది?, అంచనాలు తారా స్థాయికి చేరుకుంటాయి కదా?, ఈ సినిమాకు కూడా ప్రారంభం లో అలాంటి అంచనాలే ఉండేవి. కానీ షూటింగ్ వాయిదా పడుతూ రావడం, షూటింగ్ పూర్తి అయ్యాక సినిమా అనేక సార్లు వాయిదా పడడం వల్ల అంచనాలు బాగా తగ్గిపోయాయి. కానీ థియేట్రికల్ ట్రైలర్ నుండి మళ్ళీ అంచనాలను పెంచుకున్నారు. నిన్న విడుదల చేసిన మేకింగ్ వీడియో అయితే వేరే లెవెల్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.
Also Read: విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ టైటిల్ మార్పు..కొత్త టైటిల్ ఇదే..కారణం ఏంటంటే!
రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్స్ పెంపుకి నిర్మాత ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేస్తే పెంచుకోవడానికి అంగీకరించాయి. విడుదలకు ముందు రోజు రాత్రి పైడ్ ప్రీమియర్ షోస్ వేసుకునేందుకు కూడా అనుమతిని ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో ప్రీమియర్ షోస్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలు అయ్యాయి. బుకింగ్స్ ప్రారంభించిన వెంటనే ప్రతీ చోట హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి. చూస్తుంటే ఈ చిత్రానికి బంపర్ ఓపెనింగ్ పడేలాగానే కనిపిస్తుంది. ఇదంతా పక్కన పెడితే రేపు జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీసింది. అభిమానులు ఈవెంట్ మ్యానేజర్స్ పై, అదే విధంగా నిర్మాత పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కారణం ఏమిటంటే, కష్టపడి ఈ సినిమా కోసం మొదటి నుండి పని చేస్తున్న వారికి ఒక్క పాస్ కూడా ఇవ్వడం లేదని, మొత్తం వాళ్లకి ఇష్టమైన వాళ్లకి ఇచ్చుకుంటున్నారని అంటున్నారు.
తెలంగాణ జనసేన పార్టీ ప్రెసిడెంట్ కి 500 కి పైగా పాసులు ఇచ్చారని, మిగతా వాళ్లకు రానివ్వకుండా చేస్తున్నారని,ఇదెక్కడి న్యాయం అంటూ సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే నీకు నీ సినిమాకు ఒక దండం రా బాబు అంటూ ట్వీట్స్ వేస్తున్నారు. రేపు శిల్ప కళావేదిక లో ఈ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ సందర్భంగా అభిమానుల కోసం మూవీ టీం కాసేపటి క్రితమే ఒక ప్రెస్ నోట్ ని విడుదల చేసింది. కేవలం పాసులు ఉన్నవారికి మాత్రమే లోపలకు అనుమతి ఉంటుందని, మిగిలిన వాళ్లకు లేదని, దయచేసి ఈవెంట్ వద్దకు వచ్చి రచ్చ చేయకండి అంటూ చెప్పుకొచ్చారు. మరి మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న సినిమా, చెప్తే వాళ్ళు వింటారా?, చూడాలి మరి రేపు ఈవెంట్ ఎలా ఉండబోతుంది అనేది.