Manamey Movie Review: మనమే మూవీ రివ్యూ…

Manamey Movie Review: శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో మనమే అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది శర్వానంద్ ఖాతాలో మరొక సక్సెస్ వచ్చి చేరిందా లేదా...

Written By: Gopi, Updated On : June 7, 2024 2:25 pm

Manamey Movie Review

Follow us on

Manamey Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో వైవిద్యమైన కథాంశాలను ఎంచుకుంటూ సినిమాలు చేస్టడం లో శర్వానంద్(Sharwanand) ముందు వరుసలో ఉంటాడు. ఇక తన కెరియర్ మొదట్లోనే వెన్నెల, ప్రస్థానం లాంటి డిఫరెంట్ సినిమాలతో అలరించిన ఆయన ఈమధ్య సినిమాల సక్సెస్ లా పరంగా కొంతవరకు వెనుకబడ్డాడు..ఆయనప్పటికి తను ఎక్కడ తగ్గకుండా డిఫరెంట్ అటెంప్ట్ లతోనే సినిమాలు చేస్తున్నాడు. ఇక అందులో ముఖ్యంగా శ్రీరామ్ ఆదిత్య(Sriram Adithya) డైరెక్షన్ లో మనమే అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది శర్వానంద్ ఖాతాలో మరొక సక్సెస్ వచ్చి చేరిందా లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే శర్వానంద్ కృతి శెట్టి ఇద్దరూ కూడా పెళ్లి చేసుకొని లండన్ లో సెటిల్ అయితారు. అయితే వీళ్ళకి ఒక బాబు కూడా ఉంటాడు. ఇక శర్వానంద్ ఎప్పుడు తను వర్క్ బిజీ లో ఉంటూ వాళ్ళ బాబుని నెగ్లేట్ చేస్తూ ఉంటాడు. ఈ విషయం మీదే కృతి శెట్టి చాలాసార్లు శర్వానంద్ తో గొడవపడుతూ ఉంటుంది. ఇక బాబు విషయం లో శర్వానంద్ తన వైఖరి మార్చుకోడు. దాంతో కృతి శెట్టి ఏం చేసింది? అసలు ఆ పిల్లాడి గురించి కృతి శెట్టి అంత కేర్ తీసుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమాని చూడాల్సిందే…

విశ్లేషణ

ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాని డిఫరెంట్ అటెంప్ట్ గా మార్చే ప్రయత్నం అయితే చేశాడు. ఇక అందులో భాగంగానే కథ కొత్తగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఈ కథ రాసుకున్నప్పటికీ ఇదొక రొటీన్ రెగ్యూలర్ ఫార్మాట్లో సాగే కథ కావడం విశేషం…ఇక ఇప్పటికే ఇలాంటి కథలతో చాలా సినిమాలు వచ్చాయి. అయినప్పటికీ శ్రీరామ్ ఆదిత్య ఎందుకు ఇలాంటి కథను ఎంచుకొని సినిమాగా చేయాలని అనుకున్నాడు అనేది ఎవ్వరికీ అర్థం కాదు. ఇంక సినిమా స్టార్ట్ అయిన మొదటి పది నిమిషాలు చాలా ఎంగేజింగ్ గా అనిపించినప్పటికీ ఆ తర్వాత నుంచి సినిమాలో అసలు ఒక్క హై మూమెంట్ కూడా ఉండకపోవడం అనేది ప్రేక్షకుడిని చాలా వరకు డిజప్పాయింట్ కి గురి చేసే విషయమనే చెప్పాలి.

ఇక అలా ఫస్ట్ హాఫ్ మొత్తం సింపుల్ గా హై ఎమోషన్, ఎలివేషన్ ఏది లేకుండా సాగుతుంది. ఇంకా ఇంటర్వెల్ బ్యాంగ్ లోకి వచ్చేసరికి ఒక చిన్న ట్విస్ట్ తో ముగిస్తాడు. ఇక ఆ తర్వాత నుంచి దర్శకుడు సినిమాని సక్సెస్ ట్రాక్ లోకి తీసుకు రావాలనే ప్రయత్నం అయితే చేశారు. అయినప్పటికీ సినిమాలో ఫస్ట్ హాఫ్ చూసిన ప్రతి ప్రేక్షకుడికి సెకండ్ హాఫ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ అయితే ఉండదు. అయినప్పటికీ వాడు అతి కష్టం మీద కూర్చొని సినిమా ని చూస్తున్నంత సేపు సెకండాఫ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే కొంతమేరకు బాగానే ఉంది అనే ఫీల్ అయితే కలుగుతుంది. ఇక ఫస్ట్ హాఫ్ లో సెట్ చేసిన ప్రతి సీన్ కి సెకండ్ హాఫ్ లో పే ఆఫ్ ఇస్తూ వచ్చాడు. ఇక ఈ క్రమంలోనే సెకండ్ హాఫ్ లో ఈ సినిమా మీద ప్రేక్షకుడు కొంతవరకు ఎంగేజ్ అయితే అవుతాడు. కానీ అప్పటికే ప్రేక్షకుడిలో సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం పోయి ఉంటాడు. ఈ అయినప్పటికీ ఎంటైర్ సినిమాలో ఒక్క హై ఎలివేషన్ సీన్ కూడా ఉండదు దానివల్ల ప్రేక్షకుడు కొంతవరకు సినిమాను చూడడానికి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే వస్తుంది. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ లాంటి కమెడియన్స్ ఉన్నప్పటికీ వాళ్ళు ఎలాంటి ఇంపాక్ట్ ని చూపించకపోవడం అనేది ఈ సినిమాకి మరొక మైనస్ గా మారింది.

ఇక శ్రీరామ్ ఆదిత్య ఇంతకుముందు చేసిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో ఇంత వీక్ కంటెంట్ ని, అలాగే అంత వీక్ స్క్రీన్ ప్లే ని ఎలా రాసుకున్నాడు అనే అనుమానాలు అయితే మనకు కలుగుతాయి. ఇక మొత్తానికైతే శ్రీరామ్ ఆదిత్య పెట్టిన ఎఫర్ట్ అనేది ఈ సినిమాకి అంత బాగా వర్కౌట్ అయితే అవ్వలేదు… ఇక ఈ సినిమా లో మ్యూజిక్ అయితే అసలేం బాగాలేదు. ఈ సినిమాలో బిట్ సాంగ్స్, ఫుల్ సాంగ్స్ అన్ని కలిపి 15 సాంగ్స్ ఉండడం అనేది ఈ సినిమాకు మరో మైనస్ గా మారిందనే చెప్పాలి

Also Read: Love Mouli Movie Review: లవ్ మౌళి మూవీ రివ్యూ…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఇక ఈ సినిమాలో ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే శర్వానంద్ ప్రతి సినిమా మాదిరిగానే ఈ సినిమాలో కూడా తన పూర్తి ఎఫర్ట్ పెట్టి అయితే నటించాడు. అయినప్పటికీ ఆ క్యారెక్టర్ లో ఉన్న కొన్ని కన్ఫ్యూజన్స్ వల్ల క్యారెక్టర్ ఎటు పోతుందో చూసే ప్రేక్షకుడికైతే అర్థం కాదు. కృతి శెట్టి కూడా తన పాత్రలో 100% ప్రయత్నం అయితే చేసింది. రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్ లాంటివారు కొద్దివరకు కామెడీని పండించారు…ఇక మిగతా ఆర్టిస్టులందరూ వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…

టెక్నికల్ అంశాలు

ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన హసిం అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ ఏ మాత్రం సినిమాకి హెల్ప్ అయ్యే విధంగా అయితే లేదు. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాని అందులో వచ్చే సీన్స్ ని ఎలివేట్ చేయడంలో అసలు ఇంపాక్ట్ చూపించలేకపోయింది. ఇక ఈ సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ తన విజువల్స్ తో సినిమాని మరొక మెట్టు పైకి ఎక్కించే ప్రయత్నం అయితే చేశాడు… సినిమా మూడ్ ను బట్టి దానికొక ప్రత్యేకమైన స్టైల్ ని కూడా ఏర్పాటు చేసి ఆ విజువల్స్ ని ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చాలావరకు ప్రయత్నం చేశాడు…ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా రిచ్ గా ఉన్నాయి…

ప్లస్ పాయింట్స్

శర్వానంద్ యాక్టింగ్

సెకండాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్

Also Read: Satyabhama Movie Review: సత్యభామ ఫుల్ మూవీ రివ్యూ…

మైనస్ పాయింట్స్

రోటీన్ కథ…

స్క్రీన్ ప్లే క్లారిటీ గా రాసుకోలేదు…

మ్యూజిక్

రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.25/5

చివరి లైన్

ఈ డైరెక్టర్ కూడా శర్వానంద్ ను కాపాడలేకపోయాడు…