Chandrababu: కెసిఆర్ అనుకున్నారు.. చంద్రబాబు చేసి చూపించారు

తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావాలని కెసిఆర్ గట్టిగానే ప్రయత్నించారు. అదే జరిగితే రాష్ట్రంలో కుమారుడికి పట్టం కట్టి.. తాను కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లాలని బలంగా భావించారు. తెలంగాణ సాధన పార్టీగా ఉన్న టిఆర్ఎస్ ను.. బీఆర్ఎస్ గా మార్చేశారు. ఏపీ తో పాటు ఒడిశా, మహారాష్ట్రలో విస్తరించాలని చూశారు.

Written By: Dharma, Updated On : June 7, 2024 1:08 pm

Chandrababu

Follow us on

Chandrababu: కొందరే కలలు కంటారు. కానీ మరికొందరు దానిని సాకారం చేసుకుంటారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలో చక్రం తిప్పాలని భావించారు. దేశం మొత్తం తిరిగారు. అన్ని పార్టీల మద్దతు కూడగట్టారు. కాంగ్రెస్, బిజెపిలకు సమాంతరంగా.. ఒక కూటమి ఏర్పాటు చేయాలని భావించారు. అది ఒక కార్యరూపం దాల్చకుండానే ఆయన ప్రయత్నం ఫెయిల్ అయ్యింది. కానీ ఇప్పుడు చంద్రబాబుకు మాత్రం అనూహ్యంగా కేంద్రంలో చక్రం తిప్పే ఛాన్స్ వచ్చింది. కింగ్ మేకర్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అనుకోని అవకాశం రావడంతో చంద్రబాబు అల్లుకుపోతున్నారు.

తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావాలని కెసిఆర్ గట్టిగానే ప్రయత్నించారు. అదే జరిగితే రాష్ట్రంలో కుమారుడికి పట్టం కట్టి.. తాను కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లాలని బలంగా భావించారు. తెలంగాణ సాధన పార్టీగా ఉన్న టిఆర్ఎస్ ను.. బీఆర్ఎస్ గా మార్చేశారు. ఏపీ తో పాటు ఒడిశా, మహారాష్ట్రలో విస్తరించాలని చూశారు. అక్కడ రాష్ట్ర శాఖలను కూడా ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల అధినేతలను కలిశారు. వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. ఇందులో కొంతవరకు సక్సెస్ అయ్యారు కూడా. కానీ ఆయన ఒకటి తలిస్తే.. తెలంగాణ ప్రజలు మరొకటి తలిచారు. కెసిఆర్ ను దారుణంగా ఓడించారు. తాజాగా సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ సమాజంలో కనీస ఉనికి లేకుండా చేశారు. ప్రస్తుతం కెసిఆర్ బలం జీరో.

అయితే ఇప్పటివరకు జీరో గా ఉన్న చంద్రబాబు ఒక్కసారిగా హీరోగా మారారు. కెసిఆర్ కలలను చంద్రబాబు నిజం చేసుకునే ఛాన్స్ వచ్చింది. ఏపీలో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న చంద్రబాబు.. సార్వత్రిక ఎన్నికల్లో కూడా సత్తా చాటారు. 17 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసి 16 చోట్ల గెలిచారు. దేవుడు వరమిచ్చినట్టు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారారు. కేంద్రంలో హ్యాట్రిక్ సాధించాలంటే చంద్రబాబు అవసరం బిజెపికి ఏర్పడింది. అందుకే నిన్నటి వరకు చంద్రబాబును పట్టించుకోనినేషనల్ మీడియా అందలానికి ఎక్కించింది. అపాయింట్మెంట్ ఇవ్వని కేంద్ర పెద్దలు పక్కనే కూర్చోబెట్టి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. క్యాబినెట్ కూర్పు లోనే కాదు ప్రత్యేక హోదా, ప్రత్యేక నిధులు.. ఇలా ఒకటేమిటి అన్నింటా చంద్రబాబుకు ప్రాధాన్యం దక్కనుంది. ఒక్క బాటలో చెప్పాలంటే కేంద్రంలో ఇప్పుడు చంద్రబాబు కింగ్ మేకర్. కానీ అలా మారాలనుకున్నారు కేసీఆర్. అందుకోసం కలలు కన్నారు. కానీ సాకారం చేయలేకపోయారు. ఇప్పుడు అదే పని చంద్రబాబు చేస్తుండటంతో ఒకప్పటి స్నేహితుడిగా ఆనందిస్తున్నారో.. ఇప్పటి ప్రత్యర్థిగా బాధపడుతున్నారో చూడాలి.