Mana Shankara Varaprasad Garu 4 Days Collections: రోజురోజుకి బాక్స్ ఆఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం రాబడుతున్న వసూళ్లను చూసి ట్రేడ్ పండితులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అవుతోంది. విడుదల రోజు నుండి ఇప్పటి వరకు ఈ సినిమాకు టికెట్స్ దొరకడం చాలా కష్టం అయిపోయింది. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ రేంజ్ టికెట్స్ డిమాండ్ ఒక సినిమాకు చూసి చాలా ఏళ్ళు అయ్యింది. అయితే ఈ సినిమాకు వస్తున్న వసూళ్లను చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ చిత్రం పవన్ కళ్యాణ్ ‘ఓజీ’, ఎన్టీఆర్ ‘దేవర ‘ ఫుల్ రన్ వసూళ్లను అధిగమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. రిటర్న్ జీఎస్టీ తో కలిపి ఈ చిత్రానికి 4 రోజుల్లో ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లు ఎంతో వివరంగా చూద్దాం.
సంక్రాంతి రోజున, అనగా నాల్గవ రోజున ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి 15 కోట్ల 53 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఇది సాధారణమైన విషయం కాదు. ఇక ప్రాంతాల వారీగా నాలుగు రోజుల్లో వచ్చిన వసూళ్లను పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి 25 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, సీడెడ్ ప్రాంతం నుండి 10 కోట్ల 75 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 9 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అదే విధంగా గుంటూరు జిల్లా నుండి 6 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిరానికి, తూర్పు గోదావరి జిల్లా నుండి 7 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 5 కోట్ల 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక కృష్ణా జిల్లా నుండి 5 కోట్ల 46 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, నెల్లూరు జిల్లా నుండి 3 కోట్ల 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి
ఓవరాల్ గా మొదటి నాలుగు రోజులకు గాను ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 74 కోట్ల రూపాయిల షేర్ వసూలు వచ్చాయి. ఇక కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 6 కోట్ల 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి ఓవర్సీస్ నుండి 13 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా మొదటి నాలుగు రోజులకు గాను ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 93 కోట్ల 16 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. గ్రాస్ వసూళ్లు దాదాపుగా 155 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని సమాచారం. అంతే కాదు నేటి తో ఈ చిత్రం వంద కోట్ల షేర్ మార్కుని అందుకోబోతుంది. చిరంజీవి కి ఇది నాల్గవ వంద కోట్ల సినిమా . స్టార్ హీరోలకు కూడా ఇలాంటి రికార్డు లేకపోవడం గమనార్హం. ఇదే ఊపు కొనసాగితే వచ్చే వారం ఓజీ , దేవర ఫుల్ రన్ కలెక్షన్స్ ఎగిరిపోవడం ఖాయం.