Venkatesh Trivikram film: మాటల మాంత్రికుడిగా తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్న రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్…ఆయన కెరియర్ మొదట్లో చాలా సక్సెస్ ఫుల్ సినిమాలకు కథలను అందించి ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత డైరెక్టర్ గా మారి సూపర్ హిట్ సినిమాలను చేశాడు. ప్రస్తుతం వెంకటేష్ తో చేస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాతో మరోసారి సక్సెస్ ను సాధించడానికి సిద్ధమవుతున్నాడు. గత సంవత్సరం త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి స్టార్ డైరెక్టర్ సైతం ఈ మధ్యకాలంలో సూపర్ సక్సెస్ లను సాధించలేకపోతున్నాడు. మహేష్ బాబు తో చేసిన ‘గుంటూరు కారం’ సినిమాతో డిజాస్టర్ ని మూట గట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో సక్సెస్ ఫుల్ సినిమాను చేయాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు… ఇక అందుకోసమే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రేక్షకులను అలరించేలా ఒక భారీ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు…
ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక చిన్న క్యామియో రోల్లో నటించబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి… ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ లోకేష్ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. కాబట్టి త్రివిక్రమ్ గణ తదుపరి సినిమాను జూనియర్ ఎన్టీఆర్ తో చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు.
ఇక వెంకటేష్ సినిమాలో భాగం చేయాలని అతనితో చిన్న కామియో రోల్ పోషింపజేసి సినిమా మీద హైప్ తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నాడు… రీసెంట్ గా మన శంకర వరప్రసాద్ సినిమాలో చిరంజీవితో పాటు వెంకటేష్ కూడా ఒక క్యామియో రోల్ పోషించి సినిమా మీద హైప్ తీసుకొచ్చాడు.
ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి భారీ విజయం రావాలన్న కూడా ఆ సినిమాలో స్టార్ హీరోలను భాగం చేస్తున్నారు… అందుకే త్రివిక్రమ్ కూడా ఈ సినిమాలో ఎన్టీఆర్ చేత క్యామియో పాత్ర చేయిస్తే బాగుంటుందని భావించాడట. అందువల్లే ఈ సినిమాలో సైతం అతన్ని భాగం చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది…