Nari Nari Naduma Murari 1st Day Collections: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో మార్కెట్ మొత్తాన్ని కోల్పోయినా శర్వానంద్(Sharwanand), ఈసారి తన కెరీర్ కి బాగా కలిసొచ్చిన ఎంటర్టైన్మెంట్ జానర్ ని నమ్ముకొని ‘నారీ నారీ నడుమ మురారి'(Nari Nari Naduma Murari) చిత్రం తో మన ముందుకొచ్చాడు. శ్రీ విష్ణు తో ‘సామజవరగమనా’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని అందుకున్న రామ్ అబ్బూరి ఏ చిత్రానికి దర్శకుడు. సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా సంక్రాంతి రేస్ లో చివరిగా రావడం వల్ల అతి తక్కువ థియేటర్స్, షోస్ మాత్రమే దక్కాయి. కానీ జనాలు కంటెంట్ ఉన్న సినిమాలను ఏ రేంజ్ ఆదరిస్తారో చెప్పడానికి ఈ సినిమా ఒక ఉదాహరణగా నిల్చింది. ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ విపరీతంగా రావడం తో ఈ సినిమాకు అన్ని ప్రాంతాల్లోనూ షోస్ పెంచారు బయ్యర్స్. ఫలితంగా మంచి ఓపెనింగ్ వసూళ్లు నమోదు అయ్యాయి.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ప్రీమియర్ షోస్ నుండి 55 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. దొరికిన అతి తక్కువ షోస్ తో ఈ మాత్రం రావడం గొప్పే. ప్రీమియర్ షోస్ నుండి మంచి పాజిటివ్ టాక్ రావడం తో ఈ చిత్రానికి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల నుండి కోటి 22 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అలా ప్రీమియర్స్ + మొదటి రోజుకి కలిపి ఈ చిత్రానికి 1 కోటి 77 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 3 కోట్ల 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది కేవలం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వసూళ్లు మాత్రమే. ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, సీడెడ్ నుండి 12 లక్షలు, ఆంధ్ర ప్రాంతం నుండి కోటి 5 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.
ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా విషయానికి వస్తే కర్ణాటక ప్రాంతం నుండి 18 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓవర్సీస్ నుండి 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 2 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 5 కోట్ల 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఊపు చూస్తుంటే ఈ చిత్రం మొదటి వారం లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి. విడుదలకు ముందు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 10 కోట్ల 25 లక్షలకు జరిగింది. ఇంకో 7 కోట్ల 55 లక్షల షేర్ వసూళ్లు వస్తే సూపర్ హిట్. ఈ వీకెండ్ తో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సోమవారం నుండి లాభాల్లోకి ఈ చిత్రం అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.