Mana Shankara Varaprasad Garu 1st Week Collections: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం చూస్తూ ఉండగానే అప్పుడే వరం రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. ఈ వారం రోజుల థియేట్రికల్ రన్ లో ఏ టాలీవుడ్ చిత్రానికి కూడా దక్కని అరుదైన రికార్డుని నెలకొల్పింది ఈ చిత్రం. విడుదల రోజు నుండి వరుసగా 7 రోజులు నాన్ స్టాప్ గా డబుల్ డిజిట్ షేర్ వసూళ్లను రాబట్టిన ఏకైక సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది ఈ చిత్రం. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 7 వ రోజు 12 కోట్ల 52 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. టాలీవుడ్ హిస్టరీ లో 7వ రోజున ఈ రేంజ్ వసూళ్లను సొంతం చేసుకున్న ఏకైక సినిమా ఇదే. ఈ చిత్రం తర్వాతి స్థానం లో ‘అలా వైకుంఠపురంలో’ చిత్రం 8 కోట్ల 43 లక్షల రూపాయలతో ఉన్నది.
ఇకపోతే ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి మొదటి వారం వచ్చిన వసూళ్లను ఒకసారి చూద్దాం. దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ ఈ వారం రోజుల్లో బ్రేక్ ఈవెన్ మార్కును అందుకొని క్లీన్ సూపర్ హిట్ గా నిల్చింది. ఒక్క నైజాం ప్రాంతంలోనే ఈ చిత్రం మొదటి వారం లో రిటర్న్ జీఎస్టీ తో కలిపి 38 కోట్ల రూపాయలకు రాబట్టింది. ఇది సాధారణమైన విషయం కాదు. అదే విధంగా రాయలసీమ ప్రాంతం లో ఈ చిత్రానికి 17 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 15 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఉత్తరాంధ్ర ప్రాంతం లో దేవర, ఓజీ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ క్లోజింగ్ వసూళ్లను ఈ చిత్రం కేవలం మొదటి వారంలోనే లేపేసిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే గుంటూరు నుండి 9 కోట్ల 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, కృష్ణ జిల్లా నుండి 9 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది.
అదే విధంగా తూర్పు గోదావరి జిల్లా నుండి 11 కోట్ల 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 7 కోట్ల 50 లక్షలు, నెల్లూరు జిల్లా నుండి 5 కోట్ల 20 లక్షలు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 113 కోట్ల 15 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 10 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్ నుండి అయితే ఏకంగా 17 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టింది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 141 కోలా రూపాయిల షేర్ వసూళ్లు, 220 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
