Pooja Hegde Slapped Co-Star: పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపుని దక్కించుకున్న హీరోయిన్స్ లో ఒకరు పూజ హెగ్డే(Pooja Hegde). ‘ఒక లైలా కోసం’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఈ హాట్ బ్యూటీ ఆ తర్వాత వరుణ్ తేజ్ మొదటి చిత్రం ‘ముకుంద’ లో హీరోయిన్ గా నటించింది. ఈ రెండు సినిమాల తర్వాత ఆమె బాలీవుడ్ లోకి అడుగుపెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ మొదటి సినిమాలోనే తనకు ఎంతో ఇష్టమైన హృతిక్ రోషన్ తో కలిసి నటించే అవకాశం ఆమెకు దక్కింది. కానీ దురదృష్టం కొద్దీ ఆ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. దీంతో కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆమె, మళ్లీ టాలీవుడ్ లోకి ‘దువ్వాడ జగన్నాథమ్’ తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ఆమె మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ, బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకుంటే చూస్తుండగానే పెద్ద స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇకపోతే ఈమధ్య కాలం లో ఎక్కువ శాతం బాలీవుడ్ సినిమాలు చేస్తూ వచ్చిన పూజ హెగ్డే, రీసెంట్ గా బాలీవుడ్ లో ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూ లో ఆమె ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ ‘ సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో పని చేస్తున్నప్పుడు నాకు ఒక వింతైన అనుభవం ఎదురైంది. షూటింగ్ సెట్స్ లో ఆ సినిమాలో హీరో గా నటిస్తున్న ఒక బిగ్గెస్ట్ సూపర్ స్టార్ బ్రేక్ టైం లో నా అనుమతి లేకుండా నా క్యారవాన్ లోకి వచ్చేసాడు. నాకు ఆ సమయం లో చాలా కోపం వచ్చేసింది. అతనికి చెంప చెళ్లుమని అనిపించాను, ఆ తర్వాత అతనితో కలిసి ఒక్క సినిమా లో కూడా నటించలేదు’ అంటూ చెప్పుకొచ్చింది.
పూజ హెగ్డే చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసింది?, ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది?, ఇంతకీ ఆమె ఇచ్చిన ఆ ఇంటర్వ్యూ ఎక్కడుంది అంటూ సోషల్ మీడియా అంతటా వెతకడం మొదలు పెట్టారు. కానీ ఎక్కడా కూడా ఆ ఇంటర్వ్యూ దొరకలేదు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అసలు పూజా హెగ్డే ఎక్కడా కూడా ఈమధ్య కాలం లో ఇంటర్వ్యూ ఇవ్వలేదని, ఒక పాన్ ఇండియన్ హీరో ఎదుగుదల ని చూడలేక ఒక హీరో అభిమానులు తమ PR టీం తో సోషల్ మీడియా లో కావాలని విష ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. మరి ఈ రూమర్స్ పై నేరుగా పూజ హెగ్డే స్పందించాల్సిందే, అప్పటి వరకు ఎవరికీ ఈ విషయం లో క్లారిటీ ఉండదు.
