Mana Shankara Varaprasad Gaaru And The Rajasaab OTT: ఈ సంక్రాంతికి విడుదలైన రెండు పెద్ద సినిమాలు ‘రాజా సాబ్'(The Rajasaab), ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad gaaru). మూడు రొజుల గ్యాప్ తో విడుదలైన ఈ రెండు సినిమాల ఫలితాలు ఏంటో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘రాజా సాబ్’ చిత్రం కమర్షియల్ గా డిజాస్టర్ ఫ్లాప్ అయితే, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి, ఇప్పటికీ అద్భుతమైన హౌస్ ఫుల్స్ షోస్ తో నడుస్తూ, రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఈ వీకెండ్ తో ఈ చిత్రం 300 కోట్ల గ్రాస్ ని కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరో పక్క ‘రాజా సాబ్’ చిత్రం క్లోజింగ్ కి దగ్గర్లో ఉంది. ఇదంతా పక్కన పెడితే ఈ రెండు సినిమాల ఓటీటీ రిలీజ్ డేట్స్ గురించి ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
వివరాల్లోకి వెళ్తే ‘రాజా సాబ్’ ఓటీటీ రైట్స్ ని డిస్నీ + హాట్ స్టార్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది. వాళ్ళతో కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం ఈ చిత్రం నాలుగు వారాల తర్వాత హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. హిందీ వెర్షన్ మాత్రం 7 వారాల తర్వాతే విడుదల అవుతుంది. ఈ ఒప్పందం ప్రకారం ఈ చిత్రం ఫిబ్రవరి 10న హాట్ స్టార్ లో సందడి చేసే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. థియేటర్స్ లో డిజాస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాని, ఓటీటీ ఆడియన్స్ ఎంత మేరకు అలరిస్తారో చూడాలి. ఇక ‘మన శంకర వరప్రసాద్ గారు’ విషయానికి వస్తే, ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని జీ5 సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది.
వాళ్ళతో కుదిరించుకున్న ఒప్పందం కూడా నాలుగు వారాల తర్వాత ఓటీటీ లో విడుదల చేసుకోవచ్చు అనే. అంటే ఈ చిత్రం కూడా ఫిబ్రవరి 10న జీ5 యాప్ లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఫిబ్రవరి నెలలో కూడా ఈ చిత్రానికి మంచి థియేట్రికల్ రన్ ఉంటే మాత్రం, ఈ సినిమా మార్చి నెలకు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. గతం లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి ఇలాగే చేశారు. ఆ సినిమాకు టీవీ టెలికాస్ట్ మరియు ఓటీటీ స్ట్రీమింగ్ ఒకే రోజు జరిగింది. ఈ చిత్రానికి కూడా అలా ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా మూడు రొజుల గ్యాప్ తో థియేటర్స్ లో విడుదలైన ఈ రెండు చిత్రాలు, ఇప్పుడు ఒకే రోజున ఓటీటీ లోకి రాబోతుండడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.