Nidhi Agarwal: ‘సలార్’, ‘కల్కి 2898 AD’ వంటి పాన్ ఇండియన్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ తర్వాత ప్రభాస్(Rebel Star Prabhas) చేసిన ‘రాజా సాబ్'(The Rajasaab Movie) చిత్రం ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ విడుదలై కమర్షియల్ గా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రీమియర్ షోస్ నుండే ఈ చిత్రానికి డిజాస్టర్ టాక్ వచ్చింది. కానీ ప్రభాస్ కి ఉన్నటువంటి క్రేజ్ కారణంగా ఓపెనింగ్స్ వరకు దుమ్ము లేపేసింది ఈ చిత్రం. కానీ ఆ తర్వాత మాత్రం బాగా డౌన్ అయిపోయింది. సంక్రాంతి కి వచ్చిన కొత్త సినిమాలకు జనాలు ఎగబడ్డారు. ఆ సినిమాలకు టికెట్స్ దొరకని వాళ్ళు ఇక వేరే ఛాయస్ లేక ‘రాజా సాబ్’ కి వెళ్లాల్సి వచ్చింది. 200 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి, కనీసం వంద కోట్ల రూపాయిల నష్టాలు వచ్చి ఉంటాయని అంచనా వేస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో ఒక హీరోయిన్ గా నటించిన నిధి అగర్వాల్(Nidhi agarwal) రీసెంట్ గానే ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూ లో ఆమె ప్రభాస్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. రాజా సాబ్ ఫలితం పై ప్రభాస్ రియాక్షన్ ఏంటి అని యాంకర్ అడిగిన ప్రశ్నకు నిధి అగర్వాల్ సమాధానం చెప్తూ ‘ప్రభాస్ సినిమా హిట్/ ఫ్లాప్ అనేది పట్టించుకోడు. ఆయన తన పని తానూ చేసుకొని వెళ్లిపోయే మనిషి. ఎలాంటి రాజకీయాల్లో కూడా ఆయన తలదూర్చడు. అంతే కాదు ఆయన ఒక్క శాతం కూడా ఫేక్ గా కనిపించడు. అంత పెద్ద సూపర్ స్టార్ అయినప్పటికీ, చాలా జాలీగా అందరినీ పలరిస్తుంటాడు . అసలు తానూ ఒక స్టార్ అనే విషయాన్నే మర్చిపోతాడు, ఐదేళ్ల చిన్న పిల్లవాడిని కలిసినట్టే అనిపిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ప్రభాస్ హుందాతనాన్ని చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆయన లాగా నేను ఉండగలనా అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను. ప్రభాస్ కి అసలు కమర్షియల్ గా ఉండడం రాదు. ఆయన నుండి మనం చాలా నేర్చుకోవాలి. నిన్న గాక మొన్న ఇండస్ట్రీ లోకి వచ్చిన వాళ్ళు కూడా పీఆర్ టీమ్స్ ని మైంటైన్ చేస్తుంటారు. కానీ ప్రభాస్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి పీఆర్ టీం ని మైంటైన్ చేయలేదు. ఆయనతో పని చేయడం ఒక గొప్ప అనుభూతి. ఎన్నో విషయాలు ఆయన నుండి నేర్చుకున్నాను. నా జీవితం లో అలాంటి మంచి మనిషిని ఇప్పటి వరకు చూడలేదు’ అంటూ చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్.
