ఈ క్రేజీ మూవీ ఓటీటీ విడుదలకు సిద్ధం అయ్యింది. ఈ మేరకు అధికారిక సమాచారం అందుతుంది. భ్రమయుగం ఓటీటీ హక్కులు ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ సోనీలివ్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ప్రేక్షకులకు అందుబాటులోకి తెస్తుంది. భ్రమయుగం మార్చి 15 నుండి స్ట్రీమ్ కానున్నట్లు సమాచారం. మమ్ముట్టి అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఈ అద్భుత చిత్రాన్ని బుల్లితెరపై చూసి ఎంజాయ్ చేయవచ్చు.
మమ్ముట్టితో పాటు అర్జున్ అశోకన్, సిద్దార్థ్ భరతన్ కీలక రోల్స్ చేశారు. ఈ మూవీలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. ఊహించని మలుపులతో సాగుతుంది. ప్రేక్షకులు థియేటర్స్ లో ఎంతగానో ఎంజాయ్ చేసిన చిత్రం ఓటీటీలోకి వస్తుంది. భ్రమయుగం కథ విషయానికి వస్తే… 17వ శతాబ్దంలో పోర్చుగీసు సేనలు తక్కువ కులం వారిని బానిసలుగా అమ్మి వేస్తూ ఉంటారు. వారి బారి నుండి తప్పించుకోవడానికి తేవన్(అర్జున్ అశోకన్) అడవిలోకి పారిపోతాడు.
అక్కడ ఒక పాడుబడ్డ బంగ్లా ఉంటుంది. అందులో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒకరు యజమాని కొడుమోన్ పోటీ(మమ్ముట్టి) మరొకడు వంటవాడు(సిద్దార్థ్ భరతన్). కొడుమోన్ పొట్టి నుండి తేవాన్ కి మొదట్లో మంచి ఆతిధ్యం దొరుకుతుంది. అయితే ఆ ఇంటి వెనుక సమాధులు ఉండటం గమనించిన తేవాన్ ఆందోళనకు గురి అవుతాడు. ఆ ఇంట్లో నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తాడు. అయితే కొడుమోన్ పొట్టి తన తాంత్రిక విద్యలతో తేవాన్ ని పారిపోకుండా అవుతుంటాడు. మరి తేవాన్ తప్పించుకున్నాడా? అసలు కొడుమోన్ పొట్టి ఎవరు? అనేది అసలు కథ…