Trisha: స్టార్ హీరో నుంచి త్రిష రూ. 5 కోట్లు ఎందుకు తీసుకుంది?

త్రిష ప్రస్తుతం తెలుగులో కూడా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకొని పోతుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

Written By: Swathi, Updated On : March 7, 2024 9:27 am

Trisha

Follow us on

Trisha: సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సక్సెస్ సాధించిన వారిలో త్రిష ముందు ప్లేస్ లో ఉంటుంది. గతంలో తెలుగు, తమిళంలో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది. ఈ రెండు భాషల్లో అగ్ర హీరోలందరి సరసన నటించి టాప్ హీరోయిన్ గా పేరు పొందింది. అయితే కమర్షియల్ సినిమాల్లో నటించే అవకాశం రాకపోవడంతో.. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూనే ఇండస్ట్రీలో కొనసాగింది. కానీ కొన్ని రోజులకు ఈమెకు క్రమంగా అవకాశాలు తగ్గిపోయాయి.

లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో అనుకున్న స్థాయిలో పెద్దగా సక్సెస్ కాలేకపోయింది త్రిష. చాన్స్ లు రాకపోవడంతో ఇండస్ట్రీకే దూరం అయింది ఈ బ్యూటీ. క్రమంగా ఈమెను మర్చిపోతారు అనుకున్న సమయంలోనే మణిరత్నం అవకాశం కల్పించారు. ఈయన దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ అనే సినిమా ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతే కాదు ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలా కోలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశం వచ్చింది.

త్రిష ప్రస్తుతం తెలుగులో కూడా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకొని పోతుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. దాదాపు 18 సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇలా కెరీర్ లో బిజీగా ఉన్న త్రిష గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్రిష ఫస్ట్ ఇన్నింగ్స్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే ఒక చిన్న పని చేసి ఏకంగా స్టార్ హీరో నుంచి రూ. 5 కోట్లు తీసుకుందట.

అయితే ఈమె హీరోయిన్ గా నటించే సమయంలో ఒక సినిమా ఆఫర్ వచ్చిందట. కానీ అందులో నటించడం హీరోకు ఇష్టం లేదట. త్రిష తప్పుకుంటే అందులో తనకు ఇష్టమైన నటి నటిస్తుందని.. రూ 5 కోట్ల ఆఫర్ ఇచ్చారట. వాటిని తీసుకొని త్రిష సైడ్ అయిందట. కానీ ఈ మనీని త్రిషనే డిమాండ్ చేసిందని కొందరు అంటే.. హీరో ఆఫర్ చేశారు అని కొందరు అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది వారు స్పందిస్తే గానీ తెలియదు..