https://oktelugu.com/

NTR: ఎన్టీఆర్ ను రౌడీలా ఉన్నాడనుకున్నాడు కానీ స్టార్ హీరోను చేశాడు ఆ డైరెక్టర్..ఇంతకీ ఏ సినిమా

షూటింగ్ పూర్తికాగానే తిరిగి ఇండియాకు బయలుదేరారట. ఆ సమయంలో జూ. ఎన్టీఆర్ దగ్గరకు బుజ్జి, వివి వినాయక్ వచ్చారట. ఈ ఇద్దరు ఎన్టీఆర్ తో మా దగ్గర కథ ఉందని.. అది ఆయనకు బాగా సెట్ అవుతుంది అన్నారట.

Written By: , Updated On : March 7, 2024 / 10:14 AM IST
NTR

NTR

Follow us on

NTR: సినిమా ఇండస్ట్రీలో ఎన్ని సినిమాల్లో నటించినా హిట్ లేకపోతే వారి గురించి తెలియడం కూడా కష్టమే. కానీ ఓవర్ నైట్ లో సెలబ్రెటీలు అయ్యేవారు కూడా చాలా మంది ఉంటారు. ముందు కొన్ని సినిమాల్లో నటించినా.. ఆది సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్. వివి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది సినిమా సూపర్ సక్సెస్ ను సొంతం చేసుకుంది. జూ. ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో నటిస్తున్న సమయంలో వారు చిత్రీకరణ కోసం స్విజ్జర్లాండ్ వెళ్లారట.

షూటింగ్ పూర్తికాగానే తిరిగి ఇండియాకు బయలుదేరారట. ఆ సమయంలో జూ. ఎన్టీఆర్ దగ్గరకు బుజ్జి, వివి వినాయక్ వచ్చారట. ఈ ఇద్దరు ఎన్టీఆర్ తో మా దగ్గర కథ ఉందని.. అది ఆయనకు బాగా సెట్ అవుతుంది అన్నారట. దీంతో జూ. ఎన్టీఆర్ హైదరాబాద్ లో కలవమన్నారట. ఆ తర్వాత హైదరాబాద్ లో ఎన్టీఆర్ కు కథ చెప్పడానికి వెళ్లారట. కానీ ఆ సమయంలో ఎన్టీఆర్ ను చూసి చూడడానికి రౌడీలాగా ఉన్నాడు. ఈయనతో సినిమా తీయగలమా అనుకున్నారట. పరిస్థితులు ఎలా ఉన్నా ఎన్టీఆర్ కు కథ చెప్పడానికి సిద్దమయ్యారట.

అయితే తనకు కథ మొత్తం చెప్పాల్సిన అవసరం లేదని.. ఇంటర్వెల్, చివర మొదలు ఎలా ఉంటుందో చెప్పాలని చెప్పారట. కానీ రెండు గంటల పాటు పూర్తి కథను చెప్పారట. కథ విన్న ఎన్టీఆర్ మనం సినిమా చేస్తున్నామని తెలిపారట. ఇక ఈ విషయం ఇండస్ట్రీలో చాలా స్ప్రెడ్ అయిందట. ఆ తర్వాత ఎన్టీఆర్ నుంచి వివి వినాయక్ కు కబురు రాగానే వెంటనే వెళ్లారట. తనకు లవ్ స్టోరీలు చేయడం ఇష్టం లేదని.. ఏదైనా మాస్ కథ ఉంటే చెప్పమన్నారట. దాంతో వెంటనే తాను అనుకున్న కొన్ని సీన్లను ఎన్టీఆర్ కు వివరించారట

అందులో చిన్న పిల్లవాడు బాంబులు వేయండి, ఫ్యాక్షన్ లాంటి అంశాలను చెప్పడంతో తనకు ఫ్యాక్షన్ సినిమాలు హెవీ అవుతాయి కావచ్చు అన్నారట. ఇక ఎన్టీఆర్ కు ఇష్టం లేదని అర్థమై… సమయం కావాలని కోరి ఏడు రోజుల్లో 58 పేజీల స్క్రిప్ట్ ను రెడీ చేసి ఎన్టీఆర్ కు వివరించారు. కథ విన్న ఎన్టీఆర్ కచ్చితంగా చేద్దాం అన్నారట. ఇక ఆది సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.