Director Ranjith: కేరళ చలన చిత్ర అకాడమీని వీడిన ప్రముఖ దర్శకుడు.. ఆయన రాజీనామా తర్వాత రెచ్చిపోయిన నటుడు!

మలయాళ చిత్ర పరిశ్రమలో సంక్షోభం మొదలైంది. ప్రముఖ మలయాళ దర్శకుడు రంజిత్‌ కేరళ చలనచిత్ర అకాడమీ అధిపతి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసిన వెంటనే నటుడి ‘దుష్ప్రవర్తన’ ఆరోపణపై ఓ ఆడియో సందేశాన్ని మీడియాకు విడుదల చేసి సంచలనం రేపారు.

Written By: Raj Shekar, Updated On : August 26, 2024 12:49 pm

Director Ranjith

Follow us on

Director Ranjith: మళయాల చిత్ర పరిశ్రమలో సంక్షోభం చినికి చినికి గాలివానలా మారుతోంది. 2009లో బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించిన కొద్ది రోజుల తర్వాత ప్రముఖ మలయాళ దర్శకుడు రంజిత్‌ కేరళ చలనచిత్ర అకాడమీ ఛైర్మన్‌ పదవికి ఆదివారం రాజీనామా చేశారు. మలయాళ సీనియర్‌ నటుడు సిద్ధిక్‌ తన చిన్న వయస్సులో తనపై అత్యాచారం చేశాడని తోటి నటుడు ఆరోపించడంతో అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌ జనరల్‌ సెక్రటరీ పదవికి రాజీనామా చేసిన రోజే జరగడం సంచలనం రేపింది. ఆరోపణలపై దర్శకుడు రంజిత్‌ మీడియాకు ఆడియో సందేశం విడుదల చేశారు. బెంగాలీ నటుడి వాదనలు తాను అకాడమీ బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి తనపై జరుగుతున్న దాడిలో భాగమని అన్నారు.

ఆడియోలో ఇలా..
రంజిత్‌ ఆడియలో అనేక విషయాలు ఉన్నాయి. ‘ఒక వ్యక్తిగా ఆరోపణ నాపై కలిగించిన నష్టాన్ని వెంటనే సరిదిద్దలేము. అయితే, ఆరోపణ తప్పు అని నేను నిరూపించాలి. అది అబద్ధమని ప్రజల్ని ఒప్పిస్తాను. ఆమె పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేశారు. ఏది ఏమైనప్పటికీ, నేను చర్యలతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. శుక్రవారం మీడియాతో మాట్లాడిన శ్రీలేఖ.. రంజిత్‌ దర్శకత్వంలో ’పాలేరి మాణిక్యం: ఒరు పతిరకోలపాఠకథింటే కథ’ సినిమా నిర్మాణంలో ఉండగానే ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపింది. సినీ పరిశ్రమలో జరుగుతున్న వేధింపులను బట్టబయలు చేస్తూ హేమ కమిటీ నివేదిక విడుదలైన నేపథ్యంలో ఈ ఆరోపణలు వస్తున్నాయి. మలయాళ చిత్ర పరిశ్రమలో శృంగార వేధింపుల సంస్కృతి విస్తరించిందని మేమ కమిటీ నివేదించింది. కాస్టింగ్‌ కౌచ్‌ ఉనికిలో ఉందని కమిటీ నివేదించింది. తరచుగా పురుషులు సిఫార్సు చేస్తారు.. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం, మద్యం తాగిన మగ సహ నటులు మహిళలకు బలవంతం, ఇతర విషయాలతోపాటు.. గత నాలుగు దశాబ్దాలుగా సుప్రసిద్ధ స్క్రిప్ట్‌ రైటర్, ఫిల్మ్‌ మేకర్‌ అయిన రంజిత్‌ను 2021లో సీపీఐఎం ప్రభుత్వం అకాడమీ చైర్మన్‌గా చేసింది.

స్పందించిన మంత్రి..
ఆరోపణల తర్వాత, రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సాజీ చెరియన్‌ స్పందించారు. ‘ఆరోపణ ఆధారంగా అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేము. మేము స్త్రీల కోసం ఉన్నాం. ఏదైనా చర్య కోసం రాతపూర్వక ఫిర్యాదు ఉండాలి. రంజిత్‌ను అకాడమీ చైర్మన్‌గా తొలగించాలా వద్దా అనే దానిపై పార్టీ స్రిపిఐ(ఎం) నిర్ణయం తీసుకోవాలి. ఈ ఆరోపణలపై రంజిత్‌ స్పందించారు’ అని మంత్రి తెలిపారు.