Jyothi Rai: సీరియల్ నటి జ్యోతి రాయ్ పరిచయం అక్కర్లేని పేరు. ఈ కన్నడ భామ గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగులో పాపులారిటీ దక్కించుకుంది. రిషి కి తల్లిగా జగతి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. రిషి, జగతి మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్, మదర్ సెంటిమెంట్ సీరియల్ లో హైలెట్ అని చెప్పాలి. జ్యోతి రాయ్ పలు సినిమా ప్రాజెక్ట్స్ తో బిజీ కావడంతో సీరియల్ నుండి తప్పుకుంది. దాంతో గుప్పెడంత మనసులో జగతి క్యారెక్టర్ ని చంపేశారు.
సీరియల్ లో ఎంతో పద్ధతిగా చీరలో కనిపించే జగతి మేడం సోషల్ మీడియాలో మాత్రం పిచ్చ హాట్ ఫోటోలు షేర్ చేస్తుంది. పొట్టి బట్టలు ధరించి గ్లామరస్ ఫోటో షూట్లతో కాక రేపుతోంది. దీనిపై ఒకింత విమర్శలు వచ్చినా జ్యోతి రాయ్ ఏమాత్రం పట్టించుకోదు. ఇదంతా ప్రొఫెషన్ లో భాగమని సమర్థించుకుంటోంది. నాలుగు పదుల వయసులో కూడా వన్నె తరగని గ్లామర్ మైంటైన్ చేస్తుంది. ఈ కన్నడ భామ ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు వదులుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.
తాజాగా జ్యోతి రాయ్ గతానికి భిన్నంగా లంగా ఓణీలో దర్శనమిచ్చింది. అయితే సాంప్రదాయ లంగా ఓణీలో కూడా గ్లామర్ షో చేసింది. ఈ ఫోటోలు నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి. జగతి మేడం మీరు హీరోయిన్ మెటీరియల్. మీ అందానికి ఫిదా అయిపోయాం జగతి అంటూ కొందరు నెటిజన్లు వరుస కామెంట్స్ చేస్తున్నారు. జ్యోతి రాయ్ ఇటీవల తన లిప్స్ కి సర్జరీ చేయించుకుంది. సర్జరీ అనంతరం జ్యోతి రాయి మొఖంలో ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.
జ్యోతి రాయ్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆమె పలు సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తుంది. ఇక జ్యోతి రాయ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే .. చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని భర్తను వదిలేసింది. ప్రస్తుతం యువ దర్శకుడు సురేష్ కుమార్ తో రిలేషన్ లో ఉంది. అతనితో పెళ్లి అయిందో లేదో క్లారిటీ లేదు. కానీ అఫీషియల్ గా వీరిద్దరూ కలిసి ఉంటున్నారు. ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఇటీవల జ్యోతి రాయ్ తన ఇంటి పేరు కూడా మార్చుకోవడం విశేషం. జ్యోతి రాయ్ అనే పేరు జ్యోతి పూర్వజ్ గా మార్చుకుంది. ప్రస్తుతం ఆమె ఏ మాస్టర్ పీస్, ప్రెట్టి గర్ల్ వెబ్ సిరీస్ లలో నటిస్తుంది.