https://oktelugu.com/

Actor Shine Tom Chacko : లవ్ ప్రకటన.. నిశ్చితార్థం.. అప్పుడే బ్రేకప్.. మరో అమ్మాయి కోసం వేట.. ఇంతకీ ఎవరీ నటుడు తెలుసా?

న్యాచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడీ హీరో కమ్‌ విలన్‌. ఇందులో క్రూరమైన ప్రతినాయకుడిగా నటించి ఆడియన్స్ ను మెప్పించాడు.

Written By:
  • NARESH
  • , Updated On : August 5, 2024 / 06:31 PM IST

    Malayalam actor Shine Tom Chacko broke up with his girlfriend Tanuja

    Follow us on

    actor Shine Tom Chacko : సినీ పరిశ్రమకు చెందిన నటీనటుల ప్రొఫిషినల్ లైఫ్ లు చూసేందుకు చాలా సౌకర్యవంతంగా అందంగా కనిపిస్తాయి అనుకుంటారు కానీ మేము కూడా మనుషులమే మాకు ఓ మనసుంటుంది అంటుంటారు కొందరు.. కాకపోతే రియల్ లైఫ్ లో మాత్రం ఆదర్శంగా కనిపించే నటీనటులు ఒకింత తక్కువే ఉంటారని చెప్పాలి. కొంతమంది తమ పర్సనల్ లైఫ్ లో చాలానే అఫైర్స్.. ఆల్రెడీ పెళ్లై భార్య ఉన్నా ఇతర పెళ్లిళ్లు సంబంధాలు కూడా ఉంటాయి. కాని కొందరు మాత్రమే దొరికితే మరికొందరు మాత్రం రహస్యంగా మైంటైన్ చేస్తారు. కాగా సినిమా వాళ్లలో వయసుతో కూడా కొన్ని సార్లు సంబంధం ఉండదు. సీనియర్ జూనియర్ హీరోలు, నిర్మాతలు కూడా ఇలా పెళ్లిళ్లు చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ లిస్ట్ లో లేటెస్ట్ గా మలయాళ ప్రముఖ నటుడు టాలీవుడ్ సినిమాల్లో విలన్ గా అదరగొడుతున్న షైన్ టామ్ చాకో కూడా చేరాడు.

    ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ దసరా విలన్ అంటే మాత్రం అందరికీ టక్కున గుర్తువస్తారు. మలయాళ చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న షైన్ టామ్ ఇటీవల తెలుగులో కూడా ఎక్కువ ఆఫర్లను అందుకుంటూ కెరీర్ ను బిజీగా మార్చుకున్నారు. దసరా సినిమాలో విలన్ పాత్రలో నటించి సక్సెస్ అందుకున్న ఈయన ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాలో కూడా విలన్ పాత్రలో నటిస్తున్నారు.ఇలా వరుస తెలుగు తమిళ అంటూ తేడా లేకుండా నటిస్తూ బిజీగా మారారు ఈ నటుడు. కెరీర్ పరంగా సక్సెస్ తో దూసుకొని పోతున్న ఈయన వ్యక్తిగత జీవితంలో ఇప్పటికీ సింగిల్ గానే ఉన్నారు. అయితే నాలుగు పదుల వయసులో ఉన్న షైన్ గత కొంతకాలంగా తనూజ అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి.

    సినిమాల సంగతి పక్కన పెడితే.. గత కొన్నాళ్లుగా ప్రేమ, రిలేషన్‌షిప్‌ విషయాలతో కూడా నెట్టింట హల్ చల్ చేస్తున్నాడు. తనూజ అనే అమ్మాయితో ప్రేమలో పడ్డ ఈ నటుడు తమ ప్రేమ గురించి ఏకంగా అధికారికంగా ప్రకటించేశారు. అంతేనా వీరి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. వీరి ఎంగేజ్‌ మెంట్‌ ఫొటోల్ని కూడా సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. త్వరలో పెళ్లంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. కానీ సడన్ గా అందరికీ ఓ షాక్ ఇచ్చారు ఈ నటుడు. తనూజాతో తన సంబంధం పెళ్లి కాకుండానే ముగిసిందంటూ తెలిపారు. అంతే కాదు ఏకంగా వారి ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించారు. దీంతో వీరిద్దరూ విడిపోయారని చర్చించుకుంటున్నారు అభిమానులు.

    తనూజాతో తన రిలేషన్ షిప్ పై రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కూడా స్పందించారు చాకో. ప్రస్తుతం తాను మళ్లీ ‘సింగిల్‌’ అంటూ తన బ్రేకప్ వార్తలను కన్ఫామ్ చేశారు. ‘తనూజాతో నా బంధం ముగిసిందని.. ఇద్దరి మధ్య ఒకరినొకరికి ప్రేమ ఉన్నప్పటికీ కలిసి జీవించలేకపోయాం అన్నారు. ప్రస్తుతం మళ్లీ నచ్చిన యువతి కోసం వెతుకుతున్నాడట షైన్. తనకు ఇష్టమైన అమ్మాయిని ఎంపిక చేసుకోవడంలో వారిని ఒప్పించడంలోనూ ఎన్నో సవాళ్లు ఎదురు ఈ మలయాళ యాక్టర్ షైన్ టామ్ చాకో.

    న్యాచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడీ హీరో కమ్‌ విలన్‌. ఇందులో క్రూరమైన ప్రతినాయకుడిగా నటించి ఆడియన్స్ ను మెప్పించాడు. ఈ సినిమాల తర్వాత నాగ శౌర్య రంగబలి లోనూ విలన్‌గా క్యారెక్టర్ తో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’లోనూ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.