Major Trailer: ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా మేజర్ ట్రైలర్

Major Trailer: టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ప్రామిసింగ్ టాలెంటెడ్ హీరోల్లో అడవి శేష్ ఒకరు. భిన్నమైన కథలను ఎంచుకుంటూ… వరుసగా క్షణం, గూఢచారి, ఎవరు మూవీలతో విజయాలను సొంతం చేసుకుని తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న మూవీ ‘మేజర్’ లో అడవి శేష్ హీరోగా నటిస్తున్నాడు. కాగా ఈ సినిమా నుంచి […]

Written By: Shiva, Updated On : May 10, 2022 10:40 am
Follow us on

Major Trailer: టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ప్రామిసింగ్ టాలెంటెడ్ హీరోల్లో అడవి శేష్ ఒకరు. భిన్నమైన కథలను ఎంచుకుంటూ… వరుసగా క్షణం, గూఢచారి, ఎవరు మూవీలతో విజయాలను సొంతం చేసుకుని తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న మూవీ ‘మేజర్’ లో అడవి శేష్ హీరోగా నటిస్తున్నాడు. కాగా ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది.

Major Trailer

ఎమోషనల్ గా సాగిన ఈ ట్రైలర్ లో మెయిన్ కంటెంట్ ను ఎలివేట్ చేస్తూ ఆసక్తికరంగా కట్ చేశారు. 26/11 ముంబై దాడులకు తగ్గట్టుగానే ఇప్పుడు వచ్చిన ట్రైలర్ లో ఎమోషన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ షాట్స్ చాలా ఎఫెక్టివ్ గా ఉన్నాయి. ముఖ్యంగా అడివి శేష్ పాత్రకు సంబంధించిన ట్రాక్ ను చాలా బాగా చూపించారు. ‘గూఢచారి’ ఫేమ్ శశి కిరణ్ తిక్కా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.

Also Read: Mahesh Babu- Rajasekhar: రాజశేఖర్ మహేష్ సినిమాలో కన్ఫర్మ్.. దశ తిరుగుతుందా !

సోనీ పిక్చర్స్ సంస్థతో కలిసి మహేష్ బాబు తన ప్రొడక్షన్ హౌస్ లో ఈ మూవీని ప్రొడ్యూస్ చేయటంతో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Major Trailer

ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని.. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి కాబోతున్నాయి అని తెలుస్తోంది. ఏది ఏమైనా ‘అడివి శేష్’ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు.

జీరో నుంచి మైనస్ లోకి వెళ్లి, ప్రస్తుతం పది కోట్లు మార్కెట్ ను క్రియేట్ చేసుకుని వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు ఈ హీరో. తనకు మాత్రమే సాధ్యం అన్నట్టు వైవిధ్యమైన చిత్రాలతో పేరు తెచ్చుకున్న అడివి శేష్ కి, లేడీస్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.

Also Read:Priyanka Mohan: గుడ్డిగా అడిగేస్తోంది.. ఇలా అయితే ఎలా అమ్మడు ?

Recommended Videos


Tags