https://oktelugu.com/

Mahesh Babu Sarkaru Vaari Paata: ‘సర్కారు’ పై మహేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Mahesh Babu Sarkaru Vaari Paata: సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు – సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న క్రేజీ సినిమా ‘సర్కారు వారి పాట’. మే 12న విడుదల కానున్న ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టబోతున్నట్లు హీరో మహేష్ బాబు చెప్పారు. ‘కరోనా టైంలో ఎన్నో కష్టాలు పడి షూటింగ్ చేశాం. ఎడిటింగ్ రూమ్స్ నుంచి వచ్చే రెస్పాన్స్, తమన్ మ్యూజిక్, ట్రైలర్ కు వస్తున్న స్పందన చూస్తుంటే చాలా […]

Written By:
  • Shiva
  • , Updated On : May 10, 2022 / 08:19 AM IST
    Follow us on

    Mahesh Babu Sarkaru Vaari Paata: సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు – సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న క్రేజీ సినిమా ‘సర్కారు వారి పాట’. మే 12న విడుదల కానున్న ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టబోతున్నట్లు హీరో మహేష్ బాబు చెప్పారు. ‘కరోనా టైంలో ఎన్నో కష్టాలు పడి షూటింగ్ చేశాం. ఎడిటింగ్ రూమ్స్ నుంచి వచ్చే రెస్పాన్స్, తమన్ మ్యూజిక్, ట్రైలర్ కు వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఫస్టాఫ్‌లో 45 నిమిషాలు థియేటర్ ఊగిపోద్ది. కీర్తి సురేష్, నాకు మధ్య ట్రాక్ అద్భుతం’ అని యాంకర్ సుమతో జరిగిన ఇంటర్వ్యూలో మహేష్ అన్నారు.

    Sarkaru Vaari Paata

    ఇటు ఈ సినిమా పై ఇండస్ట్రీ సర్కిల్స్ లో కూడా పాజిటివ్ టాక్ ఉంది. సెన్స్ బుల్ సినిమాల దర్శకుడిగా పరశురామ్ కి మంచి పేరు ఉండటం, పైగా ఇప్పటివరకు షూట్ చేసిన ఫుటేజ్ బాగా రావడంతో మొత్తానికి మేకర్స్ సినిమా పట్ల గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే బడ్జెట్ పెరుగుతున్నా.. డైరెక్టర్ కోరిన ప్రతిదీ ఇవ్వడానికి నిర్మాతలు మొదటి నుంచి ఇంట్రెస్ట్ గా ఉన్నారు.

    Mahesh Babu Sarkaru Vaari Paata

    Also Read: Major Trailer: ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా మేజర్ ట్రైలర్

    ఇక ఈ సినిమాలో పాటలు అన్నీ అద్భుతంగా వచ్చాయట. తమన్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు, కాబట్టి పాటల పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి ఈ సినిమా నుంచి రాబోతున్న సాంగ్స్ ఇక ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. ఏది ఏమైనా ఈ సినిమా పై ఇండస్ట్రీ సర్కిల్స్ లో కూడా పాజిటివ్ టాక్ ఉంది. ఈ సినిమా భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ సాగుతుంది.

    Mahesh Babu Sarkaru Vaari Paata

    తన తండ్రిని మోసం చేసి, వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుంచి తిరిగి ఆ డబ్బును మహేష్ బాబు ఎలా రాబట్టాడనే కోణంలో ఈ సినిమా ఇంట్రెస్టింగ్ ప్లేతో సాగనుంది. ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ నటిస్తోంది. మైత్రీ – 14 రీల్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో మహేష్ సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తూ వెళ్తున్నాడు.

    Also Read:Priyanka Mohan: గుడ్డిగా అడిగేస్తోంది.. ఇలా అయితే ఎలా అమ్మడు ?

    Recommended Videos


    Tags