Mahesh Babu : మహేష్ బాబు ధరించిన ఈ బ్యాగ్ విలువ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

ఈ ఫొటోలో మహేష్ ధరించిన బ్యాగ్ పై ఫ్యాన్స్ కన్ను పడింది.ఈ బ్యాగ్ పేరు లూయిస్ విట్టన్ క్రిస్టోఫర్ ఎం.ఎం బ్యాక్‌ప్యాక్‌, దీని ధర అక్షరాలా 3,92,656 రూపాయిలు.

Written By: NARESH, Updated On : May 1, 2023 7:51 pm
Follow us on

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీ విడుదల కానుంది. సుమారు మూడు షెడ్యూల్స్ కి పైగా జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం బ్రేక్ పడింది.సమ్మర్ లో షూటింగ్స్ చేయడానికి పెద్దగా ఇష్టపడని మహేష్ బాబు, కొంతకాలం విరామం కోరినట్టు సమాచారం.

సంక్రాంతికి ఇంకా చాలా సమయం ఉన్నందున నిర్మాతలు కూడా మహేష్ చెప్పినట్టుగానే నడుచుకున్నారు.దీంతో మహేష్ బాబు తన భార్య పిల్లలతో కలిసి విదేశాలకు బయలుదేరాడు.అందుకోసం ఆయన శంషాబాద్ విమానాశ్రయం కి చేరుకోగా అక్కడ ఫోటోగ్రాఫర్స్ మహేష్ కి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాని ఇప్పుడు ఊపేస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా.. ఈ ఫొటోలో మహేష్ ధరించిన బ్యాగ్ పై ఫ్యాన్స్ కన్ను పడింది.ఈ బ్యాగ్ పేరు లూయిస్ విట్టన్ క్రిస్టోఫర్ ఎం.ఎం బ్యాక్‌ప్యాక్‌, దీని ధర అక్షరాలా 3,92,656 రూపాయిలు. అత్యంత ఆకర్షణీయంగా ఉన్న ఈ బ్యాక్ లోపల ఎన్నో కంపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి.సాధారణంగా మహేష్ బాబు ఈవెంట్స్ కి కానీ ఫంక్షన్స్ కి చాలా సాధారణమైన ఫార్మర్స్ తో వస్తుంటాడు.

కానీ ట్రిప్స్ కి వెళ్ళేటప్పుడు మాత్రం కాస్ట్లీ గూగుల్స్ , క్యాప్ పెట్టుకొని వెళ్తుంటాడు. ఇవి చూసేందుకు చాలా స్టైలిష్ గా ఉంటాయి, వీటి విలువ కూడా లక్షల్లోనే ఉంటుందట .అలా ఒక్కసారిగా మహేష్ తన స్టైలిష్ బ్యాగ్ తో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక మహేష్ ఈ సినిమా పూర్తి అవ్వగానే రాజమౌళి తో సినిమా చేయబోతున్నాడు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది.