https://oktelugu.com/

Telugu News Channel : తెలుగు న్యూస్ ఛానల్లో అర్ధరాత్రి అశ్లీల వీడియోలతో హలచల్

హైదరాబాద్ కేంద్రంగా ప్రసారాలు చేస్తున్న ఓ న్యూస్ ఛానల్ లో అశ్లీల వీడియోస్ టెలికాస్ట్ అయ్యాయి. అది కూడా ఒకటో రెండో నిమిషాలు కాదు వేగంగా 15 నిమిషాల పాటు ఆ ప్రచారం సాగింది.

Written By:
  • NARESH
  • , Updated On : May 1, 2023 / 08:17 PM IST
    Follow us on

    Telugu News Channel : సాధారణంగా న్యూస్ ఛానల్స్ లో వార్తలు ప్రసారం అవుతూ ఉంటాయి. ప్రస్తుతం సమాచార విస్తృతి పెరిగిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు న్యూస్ చానల్స్ అప్డేట్ ఇస్తూ ఉంటాయి. సోషల్ మీడియా వాడకం పెరిగిన నేపథ్యంలో ఇది మరింత పెరిగింది. అన్ని సామాజిక మాధ్యమాల్లో న్యూస్ చానల్స్ పోటాపోటీగా కథనాలు ప్రసారం చేస్తున్నాయి. పైగా సమాచారం అందించడంలో పోటీపడుతున్నాయి. ఇది నిన్న మొన్నటి వరకు మనకు తెలిసిన విషయం. అయితే హైదరాబాద్ కేంద్రంగా ప్రసారాలు చేస్తున్న ఓ న్యూస్ ఛానల్ లో అశ్లీల వీడియోస్ టెలికాస్ట్ అయ్యాయి. అది కూడా ఒకటో రెండో నిమిషాలు కాదు వేగంగా 15 నిమిషాల పాటు ఆ ప్రచారం సాగింది. దీంతో ఆ ఛానల్ నిర్వాహకులకు కొంతమంది ఫిర్యాదు చేశారు.

    ఇంతకీ ఏం జరిగిందంటే

    హైదరాబాదులోని బంజారాహిల్స్ కేంద్రంగా ప్రసారాలు సాగిస్తున్న ఓ న్యూస్ ఛానల్ లో గత నెల 28న అర్ధరాత్రి దాదాపు 15 నిమిషాల పాటు అశ్లీల వీడియోస్ ప్రసారమయ్యాయి. సమయంలో వార్తలు చూస్తున్న కొంతమంది ప్రేక్షకులు దిగ్బ్రాంతికి గురయ్యారు. తాము చూస్తున్నది న్యూస్ ఛానల్ లేక మరొక చానలా అని భ్రమపడ్డారు. తర్వాత తేరుకొని ఈ విషయాన్ని సదరు ఛానల్ నిర్వాహకులకు తెలియజేశారు. దీంతో వారు అప్రమత్తమై అప్పటికప్పుడు ప్రసారాలు నిలిపివేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

    ఏం జరిగి ఉంటుంది

    సాధారణంగా ఒక చానల్ కు సంబంధించిన ప్రసారాల విషయంలో పకడ్బందీ నిర్వహణ వ్యవస్థ ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి దాకా ప్రతిక్షణం పర్యవేక్షణ సాగుతూ ఉంటుంది. కానీ అర్ధరాత్రి పూట అశ్లీల వీడియోస్ టెలికాస్ట్ కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే ఇది అందులో పని చేసే వారే ఇలా చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఛానల్ కు సంబంధించి సర్వర్ కు పటిష్టమైన ఫైర్ వాల్స్ ఉండాలి. ఇతరులు ఎవరు హ్యాక్ చేయకుండా ఉండేందుకు అవి దోహదపడతాయి. కానీ సదరు చానల్ కు సంబంధించి ఫైర్ వాల్స్ అంత పటిష్టంగా లేనట్టు తెలుస్తోంది. అయితే దీనిపై సదరు చానల్ యాజమాన్యం వివరణ ఇచ్చింది. తమ ఛానల్ సర్వర్ ను ఎవరో హ్యాక్ చేశారని, అందుకే అశ్లీల వీడియోస్ టెలికాస్ట్ అయ్యాయని తెలిపింది. ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వార్త మీడియా సర్కిల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది.