https://oktelugu.com/

Pushpa 2 : పుష్ప 2′ ఇంటర్వెల్ సన్నివేశం లీక్..అల్లు అర్జున్ నటవిశ్వరూపం

ఈ ఇంటర్వెల్ సన్నివేశం లో అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ లో కనిపించబోతున్నాడట.ఆ గెటప్ ఎలా ఉంటుందో మనం ఫస్ట్ లుక్ లోనే చూసాము, ఇండియా మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది ఈ లుక్.

Written By:
  • NARESH
  • , Updated On : May 1, 2023 / 07:44 PM IST
    Follow us on

    Pushpa 2 : పాన్ ఇండియా లెవెల్ లో 1000 కోట్ల రూపాయిలు కొల్లగొట్టే సత్తా ఉన్న సినిమాలలో ఒకటి ‘పుష్ప :ది రూల్’.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప’ చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. పుష్ప చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో అన్నీ బాషలలో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఇంకా చెప్పాలంటే తెలుగు లో కంటే కూడా ఇతర భాషలలోని ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

    అలాంటి బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.డైరెక్టర్ సుకుమార్ ఆ అంచనాలకు మించి ఉండే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రీసెంట్ గా విడుదల చేసిన గ్లిమ్స్ వీడియో కి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో మన అందరం చూసాము, అన్నీ భాషలకు కలిపి సుమారుగా వంద మిలియన్ వ్యూస్ వచ్చాయి.

    ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఇంటర్వెల్ సన్నివేశం గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయట పడింది.అదేమిటంటే ఈ ఇంటర్వెల్ సన్నివేశం లో అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ లో కనిపించబోతున్నాడట.ఆ గెటప్ ఎలా ఉంటుందో మనం ఫస్ట్ లుక్ లోనే చూసాము, ఇండియా మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది ఈ లుక్.ఈ గెటప్ లోనే దాదాపుగా 35 రోజుల పాటు ఉండి షూటింగ్ చేశాడట..  అల్లు అర్జున్ మేకప్ కోసమే మూడు నుండి నాలుగు గంటల సమయం పడుతుందట.

    ఈ యాక్షన్ సన్నివేశం మొత్తం ఆడియన్స్ కి రోమాలు నిక్కపొడుచుకునే రేంజ్ లో ఉండబోతున్నట్టు సమాచారం.ఈ ఏడాది చివరి లోపు సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి , వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.పార్ట్ 1 లాగానే ఇది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందో లేదో చూడాలి.