Mahesh Babu Vs Pawan Kalyan : సూపర్ స్టార్ కృష్ణ (Krishna) నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు (Mahesh Babu) చాలా తక్కువ సమయంలోనే తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. పోకిరి (Pokiri ) సినిమాతో ఇండస్ట్రీ హిట్ ని సాధించిన ఆయన వరుస సినిమాలను చేస్తూ స్టార్ స్టేటస్ ని దక్కించుకోవడమే కాకుండా తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరితో పోటీపడుతూ నెంబర్ వన్ స్థానం కోసం ఆయన విపరీతమైన ప్రయత్నాలైతే చేస్తున్నాడు. ఇక ఆయన కెరీర్లు ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలను చేసినప్పటికి ఒక ఇండస్ట్రీ హిట్ సినిమాను మాత్రం వదులుకోవాల్సి వచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) హీరోగా వచ్చిన అత్తారింటికి దారేది (Attarintiki Daredi) సినిమాను మొదట మహేష్ బాబు తో చేయాలని అనుకున్నాడట. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం త్రివిక్రమ్ ను పిలిచి ఒక సినిమా చేద్దామని చెప్పడంతో అదే కథను పవన్ కళ్యాణ్ కి వినిపించి ఆయనతో సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు.
మొత్తానికైతే మహేష్ బాబు చేయాల్సిన సినిమాని పవన్ కళ్యాణ్ చేసి మరొక ఇండస్ట్రీ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న మహేష్ బాబు అభిమానులు కొంతవరకు నిరాశ చెందారనే చెప్పాలి.
Also Read : ధూమ్ 4′ లో సూపర్ స్టార్ మహేష్ బాబు..? డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఇక త్రివిక్రమ్ – మహేష్ బాబు కాంబినేషన్ లో ఆ తర్వాత వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో మహేష్ బాబు అభిమానులు త్రివిక్రమ్ మీద కొంతవరకు కోపాన్నితే వ్యక్తం చేశారు. ఏది ఏమైనా కూడా త్రివిక్రమ్ (Trivikram) మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా, గుంటూరు కారం ఈ మూడు సినిమాలు కూడా థియేటర్లో పెద్దగా ఆడలేదు.
అయినప్పటికి టీవీల్లో ఈ సినిమాను చూసే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగా ఉందనే చెప్పాలి. అలాగే త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో మరో సినిమా వస్తే బాగుండు అని ఎదురుచూసే అభిమానుల సంఖ్య కూడా పెరిగిపోయింది. మరి ఏది ఏమైనా కూడా మహేష్ బాబు చేయాల్సిన ఒక ఇండస్ట్రీ హిట్ సినిమాని పవన్ కళ్యాణ్ చేసి విజయాన్ని అందుకోవడమే కాకుండా ఆ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి…