https://oktelugu.com/

Mahesh- Rajamouli Movie: మహేష్ – రాజమౌళి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

Mahesh- Rajamouli Movie: సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి ఓ పాన్ ఇండియా సినిమా తీయాలని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో లీక్ అయ్యింది. ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో పట్టాలెక్కనుంది. 2024 జనవరి చివర్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 2025 జనవరి […]

Written By:
  • Shiva
  • , Updated On : June 26, 2022 / 11:46 AM IST
    Follow us on

    Mahesh- Rajamouli Movie: సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి ఓ పాన్ ఇండియా సినిమా తీయాలని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో లీక్ అయ్యింది. ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో పట్టాలెక్కనుంది. 2024 జనవరి చివర్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 2025 జనవరి 12వ తేదీని లాక్ చేశారు.

    Mahesh- Rajamouli

    మొత్తమ్మీద మహేష్ – రాజమౌళి సినిమా కోసం మరో మూడేళ్లు ఆగాల్సిందే. ఇక మహేష్ కోసం విజయేంద్ర ప్రసాద్‌ ఈ సినిమా కథను ఆఫ్రికన్‌ ఫారెస్ట్‌ నేపథ్యంలో రాశారని.. ఆ ఫారెస్ట్‌ లో ఉన్న నిధుల గుట్టల పై ఈ సినిమా సాగుతుందని గతంలో వార్తలు వినిపించాయి. ఫారెస్ట్‌ లో ఉన్న నిధుల అంటే.. ఆ నిధుల కోసం ప్రపంచ సాహస వీరులు అంతా పోటీ పడతారట. ఎవరికీ వారు ఎత్తులకు పై ఎత్తులు వేసి క్రమంలో ప్రత్యర్థులను చంపుతూ నిధి వేటకు బయలు దేరుతారని తెలుస్తోంది.

    Also Read: Nayanthara- Vignesh Shivan Assets: షాకింగ్.. నయన్ – విఘ్నేశ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

    ఫారెస్ట్‌ లో జరిగే యాక్షన్‌ ఎడ్వెంచరెస్‌ సీన్లు అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. ఎలాగూ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించడంలో రాజమౌళి మహా దిట్ట. పైగా ఆఫ్రికన్‌ ఫారెస్ట్‌ నేపథ్యం ఇండియన్ సినిమాకి పూర్తిగా కొత్త నేపథ్యం కూడా. ఇంతవరకు భారతీయ సినీ చరిత్రలో ఆ నేపథ్యంలో సినిమా రాలేదు. అందుకే ఈ సినిమా పై అంచనాలు రెట్టింపు స్థాయిలో ఉన్నాయి.

    Mahesh- Rajamouli

    ఇక ఈ సినిమా బడ్జెట్‌ పై సోషల్‌ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. బాహుబలి సిరీస్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ మించిన బడ్జెట్‌తో, అంటే దాదాపు 800 కోట్ల రూపాయలతో మహేశ్‌ సినిమా ప్లాన్‌ చేస్తున్నాడట. ఈ సినిమాలో మహేష్ లుక్ పూర్తి రఫ్ లుక్ లో ఉంటుందట. అలాగే మహేష్ మీసాలతో కనిపించబోతున్నాడని తెలుస్తోంది.

    రాజమౌళి హీరో అంటేనే.. మాస్ కి పరాకాష్ట. అందుకు తగ్గట్టుగానే హీరో లుక్ ను రాజమౌళి డిజైన్ చేస్తాడు. ఈ క్రమంలోనే మహేష్ లుక్ కోసం జక్కన్న ప్రత్యేక కసరత్తులు చేశాడట. గతంలో ఏ సినిమాలో కనిపించని విధంగా మహేష్ ఈ సినిమాలో కనిపిస్తాడట. మొత్తానికి ఈ వార్త సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ను ఇస్తోంది. ఎందుకంటే.. మహేష్ లుక్ మారితే.. ముఖ్యంగా మీసాలతో మహేష్ కనిపిస్తే చూడాలని ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

    Also Read:Nagababu Emotional Tweet: నాకప్పుడు సెన్స్ లేదు: నాగబాబు సంచలన ట్వీట్

    Tags