Nagababu Emotional Post: తండ్రిని గౌరవించే కొడుకు ఉన్న ఇళ్లంతా ఎప్పుడూ సందడిగా ఉంటుంది. బంధువులు, స్నేహితులతో ఆ ఇల్లు ఎప్పుడు కళకళలాడుతోంది. కొణిదెల వెంకట్రావు జీవితంలో ఇది రుజువు అయ్యింది కూడా. మెగాస్టార్ చిరంజీవి తండ్రిగా ఆయన ఎంతో పుత్రోత్సాహం పొందారు. కొడుకుల ఎదుగుదల చూసి ఆయన ఎంతగానో సంతోషించారు. అయితే, ఆయన పై ఉన్న ప్రేమను మాత్రం ఆయన ముందు సరిగ్గా వ్యక్తపర్చలేకపోయాను’ అని తాజాగా నాగబాబు ఫీల్ అవుతూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
‘నాన్నా మీకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు బ్రతికి ఉన్నప్పుడు మీ పై నాకు ఉన్న ప్రేమను మీతో చెప్పాలన్న జ్ఞానం నాకు అప్పుడు కలగలేదు. జ్ఞానం వచ్చింది అనుకున్నప్పుడు ఇప్పుడు మీరు లేరు’ అంటూ నాగబాబు ఎమోషనల్ అయ్యారు. నాగబాబు తన తండ్రి కొణిదెల వెంకట్రావు పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫొటోను షేర్ చేస్తూ ఇలా భావోద్వేగభరితంగా మెసేజ్ పెట్టారు.
Also Read: Mahesh- Rajamouli Movie: మహేష్ – రాజమౌళి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
పైగా నెటిజన్లకు కూడా నాగబాబు ఒక సూచన చేశారు. ‘దయచేసి మీ తల్లిదండ్రులు, మీకు బాగా ఇష్టమైన వాళ్ళు బతికి ఉండాగానే.. వారి పై మీకు ఉన్న ప్రేమను వారితో షేర్ చేసుకోండి. ఇది ప్రతి ఒక్కరు పాటించాలి’ అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
కొణిదెల వెంకట్రావుగారు పోలీస్ కానిస్టేబుల్ గా పని చేశారు. 2007 డిసెంబర్ లో గుండె సంబంధిత వ్యాధితో ఆయన చనిపోయారు. అన్నట్లు కొణిదెల వెంకట్రావు గారు బాపు దర్శకత్వం వహించిన ‘మంత్రిగారి వియ్యంకుడు’ సినిమాలో కూడా అతిథి పాత్రలో నటించి మెప్పించారు. ఎంతో కష్టపడి ఆయన కొడుకులను ప్రయోజకులను చేశారు.
అందుకే.. మెగాస్టార్ కూడా తన తండ్రి పట్ల ఎప్పుడు ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఆ మధ్య చిరంజీవి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి మాట్లాడుతూ.. `నేను గూండా సినిమా షూట్ లో ఒక రన్నింగ్ ట్రైన్ నుంచి ట్రాక్ పైకి వేలాడుతూ ఫైట్ చేశాను. ఆ సీన్ రాజమండ్రిలో షూట్ చేశారు. అది చూసి నాన్న చాలా కంగారు పడ్డారు. ఇలాంటివి వద్దు అని నాతో వారించారు. నా పై ఆయనకు అంత ప్రేమ ఉంది’ అని చిరు చెప్పుకొచ్చారు.
Also Read: Snake Bite: అద్భుతం: బాలుడిని కాటేసి చనిపోయిన పాము.. అసలేమైంది?