https://oktelugu.com/

Mahesh Babu: ఆ హీరోయిన్ తో అక్కినేని హీరో విడాకులు… మహేష్ మనసుకు గాయమైన వేళ!

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ చాలా సున్నిత మనస్కుడు. అతికొద్ది మంది స్నేహితులు మాత్రమే మహేష్ కి ఉండగా, దగ్గరైన వాళ్ళను చాలా అమితంగా ప్రేమిస్తారు. అలా మహేష్ మనసు గెలుచుకున్న వారిలో హీరోయిన్ కీర్తి రెడ్డి ఒకరు. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన అర్జున్ మూవీలో మహేష్ కి ఆమె సిస్టర్ రోల్ చేశారు. అర్జున్ మూవీ సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ సమయంలో కీర్తి రెడ్డితో మహేష్ […]

Written By:
  • Shiva
  • , Updated On : November 24, 2021 / 10:14 AM IST
    Follow us on

    Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ చాలా సున్నిత మనస్కుడు. అతికొద్ది మంది స్నేహితులు మాత్రమే మహేష్ కి ఉండగా, దగ్గరైన వాళ్ళను చాలా అమితంగా ప్రేమిస్తారు. అలా మహేష్ మనసు గెలుచుకున్న వారిలో హీరోయిన్ కీర్తి రెడ్డి ఒకరు. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన అర్జున్ మూవీలో మహేష్ కి ఆమె సిస్టర్ రోల్ చేశారు. అర్జున్ మూవీ సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ సమయంలో కీర్తి రెడ్డితో మహేష్ కి మంచి అనుబంధం ఏర్పడింది. సొంత బ్రదర్ అండ్ సిస్టర్స్ అన్నంతగా క్లోజ్ గా కీర్తి, మహేష్ మెలిగేవారట. ఆ సినిమా తర్వాత కూడా వీళ్ళ మధ్య మంచి రిలేషన్ కొనసాగింది.

    అయితే అక్కినేని హీరో సుమంత్ తో ఆమె విడిపోవడం మహేష్ జీర్ణించుకోలేకపోయారట. ఆమె వైవాహిక జీవితంలో ఎదురైన కఠిన పరిస్థితులు మహేష్ ని కూడా మానసిక వేదనకు గురి చేశాయి. కీర్తి రెడ్డి 2004లో సుమంత్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్ళైన తర్వాత ఆమె నటనకు గుడ్ బై చెప్పారు. కారణం ఏమిటో తెలియదు కానీ… పెళ్ళైన ఏడాదికే వీరి మధ్య మనస్పర్థలు రావడం జరిగింది. 2006లో విడాకులు తీసుకొని విడిపోయారు.

    కాగా కీర్తి, సుమంత్ విడాకులు తీసుకోకుండా ఆపాలని మహేష్ చాలా ప్రయత్నం చేశారట. ఇరువురికి నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారట. అయినప్పటికీ సుమంత్, కీర్తి కలిసి జీవించడానికి ఇష్టపడలేదట. సొంత సిస్టర్ కంటే ఎక్కువగా ప్రేమించిన కీర్తి విడాకుల సంఘటన మహేష్ మనసును చాలా బాధపెట్టిందట.ఇక సుమంత్ తో విడాకులు అనంతరం కీర్తి ఓ ఎన్ఆర్ఐ ని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. మరోవైపు సుమంత్ మరలా వివాహం చేసుకోలేదు. సుమంత్ కెరీర్ లో కూడా సక్సెస్ కాలేకపోయారు.

    Also Read: Naveen chandra: ఆకట్టుకుటున్న తగ్గేదే లే పోస్టర్​.. క్రైమ్ థ్రిల్లర్​తో రానున్న నవీన్​

    రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి పరిశ్రమకు పరిచయమైన కీర్తి రెడ్డి హీరోయిన్ గా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు చేశారు. పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు కరుణాకర్ తెరకెక్కించిన తొలిప్రేమ సంచలన విజయం నమోదు చేసింది. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన కీర్తి రెడ్డి భారీ ఫేమ్ తెచ్చుకున్నారు. అయితే ఆమెకు అనుకున్న స్థాయిలో అవకాశాలు దక్కలేదు.తర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ అక్కడ మూడు చిత్రాల వరకూ చేశారు. అర్జున్ ఆమెకు చివరి చిత్రం.

    Also Read: Actress Regina: బ్రేకింగ్ న్యూస్ కి రెడీగా ఉండండి అంటున్న … నటి రెజీనా

    Tags