https://oktelugu.com/

SBI Mutual Fund : ఎస్బీఐ సూపర్ స్కీమ్.. రూ.10 వేలకు లక్ష రూపాయల లాభం పొందే ఛాన్స్?

SBI Mutual Fund : మనలో చాలామంది చేతిలోని డబ్బును ఏదో ఒక స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఇతర స్కీమ్స్ తో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి లాభాలను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎస్‌బీఐ కాంట్రా ఫండ్ రెగ్యులర్ ప్లాన్ గ్రోత్ లో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేసిన వాళ్లు మంచి లాభాలను సొంతం చేసుకుంటున్నారు. 2005 సంవత్సరంలో ఎస్బీఐ ఈ స్కీమ్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 24, 2021 / 09:57 AM IST
    Follow us on

    SBI Mutual Fund : మనలో చాలామంది చేతిలోని డబ్బును ఏదో ఒక స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఇతర స్కీమ్స్ తో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి లాభాలను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎస్‌బీఐ కాంట్రా ఫండ్ రెగ్యులర్ ప్లాన్ గ్రోత్ లో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేసిన వాళ్లు మంచి లాభాలను సొంతం చేసుకుంటున్నారు. 2005 సంవత్సరంలో ఎస్బీఐ ఈ స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చింది.

    Also Read: బీటెక్ అర్హతతో ప్రభుత్వ సంస్థల్లో జాబ్స్.. నెలకు 60,000 రూపాయల వేతనంతో?

    2005 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు ఏకంగా 1138 శాతం రాబడి వచ్చింది. 2005 సంవత్సరంలో ఈ మ్యూచువల్ ఫండ్ లో 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు ఇప్పుడు ఇన్వెస్ట్ మెంట్ విలువ 1,20,000 రూపాయలుగా ఉంది. ఎన్ఏవీ రూ.200 సమీపంలో ప్రస్తుతం ఈ ఫండ్ కొనసాగుతుండటం గమనార్హం. లార్జ్ క్యాప్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఈ ఫండ్ ఉత్తమమైనదని చెప్పవచ్చు.

    దేశీయ్ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తుండగా ఈ స్కీమ్స్ ద్వారా ఎంతోమందికి ప్రయోజనం చేకూరుతుంది. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లు దీర్ఘకాలంలో భారీ మొత్తంలో రాబడులను సొంతం చేసుకుంటున్నారు. సమీపంలో ఎస్బీఐ బ్రాంచ్ ను సంప్రదించి ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

    అయితే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ మెంట్స్ లో కొన్నిసార్లు రిస్క్ కూడా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. హెచ్‌సీఎల్ టెక్, గెయిల్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫో ఎడ్జ్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, ఎయిర్‌టెల్, ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం టాప్ 10 స్టాక్స్ జాబితాలో ఉన్నాయి.

    Also Read: ఎల్‌ఐసీ అద్భుతమైన పాలసీ.. ప్రతి నెలా రూ.20 వేల పెన్షన్ పొందే ఛాన్స్!