
సృష్టికి మూలం ఆడది.. అప్పట్లో ఆడపిల్ల పుట్టిందంటే ఇంటికి మహాలక్ష్మీ వచ్చిందని భావించేవాళ్లు. అయితే నేడు ఆడపిల్ల పుడుతుందంటేనే పురిట్లోనే చిదిమేస్తున్నారు. ఒకవేళ పుట్టిన చెత్తకుప్పల్లోనే.. పొదల్లో వదిలేసి వెళుతున్నారు. తల్లిదండ్రులు ఆడపిల్లలను పెంచడం భారమని భావించడం.. వారి పెళ్లిళ్లకు లక్షల్లో కట్నాలు ఇచ్చి సాగనంపడం.. సమాజంలో ఆడవారిపై జరుగుతున్న దాడులు..వివక్ష వంటివి వారిని భూమ్మిదకు రాకుండా చేస్తున్నాయి.
Also Read: ఆర్ఆర్ఆర్ దేశభక్తి మూవీ కాదా? మరి కథేంటి?
మనస్సు తల్లిదండ్రులు మాత్రం ఆడపిల్లలను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. సమాజంలో ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతున్న కొందరు తల్లిదండ్రులు ఆడపిల్లలను ఉన్నత చదువులు చదువుతూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వాలు సైతం ఆడపిల్లల కోసం అనేక స్కీములు ప్రవేశపెడుతూ తల్లిదండ్రులకు అండగా ఉంటున్నాయి. అయితే నిత్యం ఏదోఒక చోట అమ్మాయిలపై దాడులు జరుగడం శోచనీయంగా మారింది. ప్రభుత్వాలు.. షీ టీములు వీటిపై మరింత దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నేడు(అక్టోబర్ 11)న అంతర్జాతీయ ఆడపిల్లల దినోత్సవం. ప్రపంచంలోని కోట్లాదిమంది బాలికల సమస్యలను అందరికీ తెలియజేసేలా ప్రతీయేటా అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికల దినోత్సాన్ని ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తోంది. అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకంని సూపర్ స్టార్ మహేష్ బాబు తన కూతురు సితారను ఉద్దేశించి తన ఇన్ స్ట్రాగ్రాంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read: క్లీవేజ్ షోతో రెచ్చగొడుతున్న రాశి !
‘ఈ ప్రపంచంలో ఆడపిల్లల కంటే గొప్ప బహుమతి లేదు.. నా చిన్నారిని చూస్తే చాలా గర్వంగా ఉంది.. తన చిన్న ప్రపంచాన్ని తానే నిర్మించుకుంటోంది.. నీ కలలను విస్మరించవద్దు.. నీ గొంతుక బలంగా వినిపించు.. ధైర్యంగా ఉండు.. నీకు మంచి అనిపించిన విషయాలపై గట్టిగా పోరాడు.. మనం ఈ ప్రపంచంలో సమానత్వాన్ని సృష్టిద్దాం.. నా చిన్నపాపతో ఈ ప్రపంచంలోని చిన్నారులందరితో అంతర్జాతీయ ఆడపిల్లల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుందాం’ అంటూ తన కూతురి ఫొటోను మహేష్ షేర్ చేశాడు.