గంగవ్వ డ్రీమ్ తీర్చనున్న నాగార్జున.. ఆనందంతో బయటికెళ్లిన పెద్దావిడ..!

కరోనా సమయంలో బుల్లితెర ప్రేక్షకులను బిగ్ బాస్-4 ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే బిగ్ బాస్-4 సీజన్ ఐదువారాలుగా కొనసాగుతోంది. మరో రెండునెలలు ఇదే జోష్ తో కొనసాగించేందుకు బిగ్ బాస్ నిర్వాహాకులు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుత బిగ్ బాస్-4 సీజన్ 16మంది కంటెస్టులతో ప్రారంభమైంది. Also Read: ఆర్ఆర్ఆర్ దేశభక్తి మూవీ కాదా? మరి కథేంటి? ఈసారి బిగ్ బాస్-4లో 55ఏళ్లుపైబడిన గంగవ్వ పాల్గొంది. యూట్యూబ్లో గంగవ్వ వీడియోలు చాలా పాపులయ్యారు. టీవీ ఛానల్లో కామెడీగా వార్తలు […]

Written By: NARESH, Updated On : October 11, 2020 6:49 pm
Follow us on

కరోనా సమయంలో బుల్లితెర ప్రేక్షకులను బిగ్ బాస్-4 ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే బిగ్ బాస్-4 సీజన్ ఐదువారాలుగా కొనసాగుతోంది. మరో రెండునెలలు ఇదే జోష్ తో కొనసాగించేందుకు బిగ్ బాస్ నిర్వాహాకులు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుత బిగ్ బాస్-4 సీజన్ 16మంది కంటెస్టులతో ప్రారంభమైంది.

Also Read: ఆర్ఆర్ఆర్ దేశభక్తి మూవీ కాదా? మరి కథేంటి?

ఈసారి బిగ్ బాస్-4లో 55ఏళ్లుపైబడిన గంగవ్వ పాల్గొంది. యూట్యూబ్లో గంగవ్వ వీడియోలు చాలా పాపులయ్యారు. టీవీ ఛానల్లో కామెడీగా వార్తలు చదువుతూ అందరినీ అలరించింది. అలాఅలా ఆమె బిగ్ బాస్-4కు ఎంపికైంది. అయితే బిగ్ బాస్ హౌస్ లో పాల్గొన్న కంటెస్టులందరికీ కంటే గంగవ్వ చాలా హుషారుగా కన్పించింది. ప్రతీఒక్కరిపై అదిరిపోయే పంచ్ లు.. సైటర్లు వేస్తూ హౌస్ లో నవ్వులు పూయించింది.

బిగ్ బాస్-4లో అందరికీ కంటే ఎక్కువ ఓట్లు గంగవ్వకే వచ్చాయి. దీంతో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. అయితే ఆమెకు ఆరోగ్యం సహకరించకపోవడంతో బిగ్ బాస్ నుంచి తాజాగా బయటికి వెళ్లాల్సి వచ్చింది. గతంలోనూ ఆమెకు ఆరోగ్యం సహకరించకపోవడంతో బిగ్ బాస్ హౌస్ నుంచి వెళుతానని బిగ్ బాస్ కు విన్నవించింది. అయితే బిగ్ బాస్ అందుకు అంగీకరించలేదు. దీనికి బదులుగా ఆమెకు వైద్య పరీక్షలు చేయించడంతో ఆమె తిరిగి కోలుకుంది.

తాజాగా ఆమెకు మరోసారి ఆరోగ్య సమస్యలు రావడంతో బిగ్ బాస్ ను ఆమె మరోసారి వేడుకుంది. హోస్ట్ నాగార్జున సైతం ఆమె తరుఫున రిక్వెస్ట్ చేయడంతో బిగ్ బాస్ ఈసారి ఆమెను బిగ్ బాస్ నుంచి పంపించేందుకు అంగీకరించాడు. అయితే గంగవ్వ ఏ లక్ష్యంతోనైతే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిందో దానిని సాధించిందనే చెప్పారు. బిగ్ బాస్ ఎంట్రీ సమయంలోనే తన కోరికను బిగ్ బాస్ కు గంగవ్వ చెప్పింది. తనకు ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉందని వెలిబుచ్చింది.

Also Read: క్లీవేజ్ షోతో రెచ్చగొడుతున్న రాశి !

ఇక ఆమె బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోతున్న సమయంలో హోస్టు నాగార్జున ఆమెకు ప్రామీస్ చేశాడు. నీకు ఇల్లు నేను కట్టిస్తానంటూ బిగ్ బాస్ ప్రేక్షకుల సాక్షిగా హామీ ఇచ్చాడు. కోట్లాది మంది ఫ్యాన్స్ చూస్తుండగా నాగార్జున గంగవ్వకు హామీ ఇవ్వడంతో ఆమె కల త్వరలోనే నెరవేరడం ఖాయంగా కన్పిస్తోంది. గంగవ్వ బిగ్ బాస్ టైటిల్ గెలువకున్నప్పటికీ.. తన కల డ్రీమ్ నెరవేర్చుకోవడంపై ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.