Guntur Karam Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి చేస్తున్న లేటెస్ట్ చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని లేటెస్ట్ గా విడుదల చెయ్యగా దానికి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మహేష్ బాబు లోని సరికొత్త మాస్ యాంగిల్ ని చూపిస్తూ ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ ని మెప్పించేలా చేసాడు త్రివిక్రమ్.
సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తారీఖున విడుదల అవ్వబోతున్నది అని ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే తెలిపారు. అయితే ఈ సినిమా ఇప్పుడు సంక్రాంతి కి వచ్చే ఛాన్స్ లేదని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.ఇప్పటి వరకు ఈ సినిమా కేవలం 10 శాతం మాత్రమే రెగ్యులర్ షూటింగ్ ని పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి.
జూన్ 2 వ తారీఖున కొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతుందని ఇది వరకే తెలిపారు. కానీ ఇప్పుడు ఈ షెడ్యూల్ మరోసారి వాయిదా పడింది. మహేష్ సమ్మర్ లో షూటింగ్ చెయ్యనని చెప్పి, విదేశాలకు వెళ్లిపోయాడని అప్పట్లో సోషల్ మీడియా లో వచ్చిన వార్త పెద్ద సెన్సేషన్ అయ్యింది. ఇందులో ఎలాంటి నిజం లేదంటూ ఆ చిత్ర నిర్మాత నాగ వంశీ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చాడు.
కానీ ఇప్పుడు కొత్త షెడ్యూల్ వాయిదా పడుతూ రావడాన్ని చూస్తుంటే అప్పట్లో వచ్చిన న్యూస్ నిజమే అని అంటున్నారు ఫ్యాన్స్. ఇంత నత్త నడకన షూటింగ్ సాగితే, సంక్రాంతికి కాదు కదా, కనీసం సమ్మర్ కి కూడా రావడం కష్టం అని అంటున్నారు విశ్లేషకులు. ఈ సినిమాలో హీరోయిన్స్ గా శ్రీలీల మరియు పూజ హెగ్డే నటిస్తుండగా, జగపతి బాబు విలన్ గా నటిస్తున్నాడు.