https://oktelugu.com/

Mahesh Babu Daughter : తగ్గేదేలే’ అంటున్న మహేష్ బాబు కూతురు సితార.. ఈమె అల్లు అర్జున్ కి ఇంత పెద్ద ఫ్యానా?

చాల కాలం నుండి సోషల్ మీడియా లో అల్లు అర్జున్ , మహేష్ బాబు ఫ్యాన్స్ మధ్య గిడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫోటో ని చూసి అయినా వాళ్ళ మధ్య గొడవలు తగ్గుతాయి లేదో చూడాలి.

Written By:
  • Vicky
  • , Updated On : July 23, 2023 / 05:22 PM IST
    Follow us on

    Mahesh Babu Daughter : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సృష్టించిన సెన్సేషన్ గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా తెలుగులో కంటే కూడా ఇతర భాషల్లో పెద్ద హిట్ అయ్యింది. పాన్ ఇండియన్ స్టార్ స్టేటస్ రావాలంటే కచ్చితంగా రాజమౌళి తో సినిమా చెయ్యాలి అనే అపోహని తుడిచిపెట్టి, కంటెంట్ ఉంటే ఎవరి సినిమా అయినా పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపుతుందని నిరూపించిన సినిమా ఇది.

    ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్ కి బాలీవుడ్ కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడు ఆయన రేంజ్ అక్కడి సూపర్ స్టార్స్ కి ఏ మాత్రం తీసిపోదు. ఇది ఇలా ఉండగా ఏ హీరోకి అయినా ఒక మ్యానరిజం ఉంటే అభిమానులు బలంగా ఫాలో అవుతారు, ఇది అందరికీ తెలిసిందే.

    కానీ అల్లు అర్జున్ విషయం లో మాత్రం ఏ హీరో కి కలలో కూడా ఊహించని సంఘటనలు జరిగాయి. ఈ చిత్రం లో ‘తగ్గేదేలే’ అనే డైలాగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ డైలాగ్ ని బాలీవుడ్ సూపర్ స్టార్స్ దగ్గర నుండి క్రికెటర్స్ వరకు ఒక రేంజ్ వాడేశారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార కూడా ఈ మ్యానరిజం ని వాడుతూ దిగిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. విమానము లో ప్రయాణిస్తున్న సమయం లో తీసిన ఫోటో ఇది.

    ‘తగ్గేదేలే’ అంటూ సితార అల్లు అర్జున్ మ్యానరిజం చేస్తూ మహేష్ బాబు భుజం పై తల వాల్చడం , ఆ ఫోటో ని ట్విట్టర్ లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ షేర్ చెయ్యడం, అది వైరల్ అవ్వడం అన్నీ అలా జరిగిపోయాయి. చాల కాలం నుండి సోషల్ మీడియా లో అల్లు అర్జున్ , మహేష్ బాబు ఫ్యాన్స్ మధ్య గిడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫోటో ని చూసి అయినా వాళ్ళ మధ్య గొడవలు తగ్గుతాయి లేదో చూడాలి.