https://oktelugu.com/

Chhattisgarh : అక్కడ పాములే అల్లుళ్లకు కట్నం.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా?

కన్వారా ఇది ఒక ఆదివాసీ తెగ. ఛత్తీస్‌గఢ్‌లో వీరు నివసిస్తున్నారు. వీరు ఈ వింతైన ఆచారం పాటిస్తున్నారు. ఆడపిల్లకు పెళ్లి చేసేప్పుడు వరునికి పాములను కట్నంగా ఇస్తారు. కనీసం తొమ్మిది రకాలకు చెందిన 21 పాములను కట్నంగా ఇచ్చేస్తారు. కట్నంగా పాములను ఇవ్వలేని ఆడపిల్లలను ఎవరూ వివాహం చేసుకోరు. 

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 23, 2023 / 05:31 PM IST
    Follow us on

    Chhattisgarh : ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే వధువు తల్లిదండ్రులు వరుడికి తోచినంత కట్నం ఇవ్వడం సాంప్రదాయంగా వస్తోంది. వరకట్నం మన దేశంలో నిషేధం అయినా.. అన్ని కులాలు, మతాల్లో ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. చట్టాలు అమలుచేసే అధికారులు సైతం కట్నం లేనిదే పెళ్లి చేసుకోవడం లేదు. ఇక కట్నం విషయంలో ఒకోక ప్రాంతంలో ఒక్కో ఆచారం ఉంది. ఒక్కో మతంలో ఒక్కో సంప్రదాయం కొనసాగుతోంది. చాలా మంది డబ్బులు కట్నంగా తీసుకుంటిన కొందరు తమ కుల ఆచారాల ప్రకారం గోవులు, గొర్రెలు, మేకలు, గాడిదలు కట్నంగా ఇస్తారు. ఒక మతంలో కేవలం ఆభరణాలే కట్నంగా తీసుకుంటారు. వీటికి భిన్నంగా అక్కడ అల్లుళ్లకు పాములను కట్నంగా ఇస్తారు. అదెక్కడో.. ఎందుకు అలా ఇస్తారో తెలుసుకుందాం.

    కన్వారా తెగలో ఈ వింత ఆచారం.. 
    కన్వారా ఇది ఒక ఆదివాసీ తెగ. ఛత్తీస్‌గఢ్‌లో వీరు నివసిస్తున్నారు. వీరు ఈ వింతైన ఆచారం పాటిస్తున్నారు. ఆడపిల్లకు పెళ్లి చేసేప్పుడు వరునికి పాములను కట్నంగా ఇస్తారు. కనీసం తొమ్మిది రకాలకు చెందిన 21 పాములను కట్నంగా ఇచ్చేస్తారు. కట్నంగా పాములను ఇవ్వలేని ఆడపిల్లలను ఎవరూ వివాహం చేసుకోరు.
    పూర్వీకుల నుంచీ.. 
    పాములను కట్నంగా ఇచ్చే ఆచారం తమ పూర్వీకుల నుంచి వస్తుందని కన్వారా తెగ పెద్దలు చెబుతున్నారు. తమ పూర్వికులు కనీసం 60 పాములను కట్నంగా ఇచ్చేవారని అంటున్నారు. ప్రస్తుతం ఆ సంఖ్య క్రమంగా తగ్గినట్లు ఆ తెగకు చెందిన ఓ సభ్యుడు కటంగీ తెలిపారు. పాములను కట్నంగా ఇవ్వండం తమ ఆచారంగా వస్తోందని వెల్లడించారు.
    పాములను ఆడించడమే వృత్తి.. 
    ఇక కన్వారా తెగ ప్రజలు తమ పూర్వీకుల నుంచి కూడా పాములను ఆడిచడమే జీవనాధారంగా చేసుకున్నారు. వివిధ రకాల పాములను పట్టుకుని వాటిని ఆడిస్తూ వచ్చిన డబ్బులతోనే జీవనం సాగిస్తారు. పాములనే తమ ఆస్తిగా భావిస్తారు. అందుకే ఆడపిల్లకు కట్నంగా పాములనే ఇస్తుంటారు.
    పాములను పట్టుకోవడంపై ఫిర్యాదులు..
    అయితే పాములను పంట్టుకోవడం, ఆడించడం ద్వారా కన్వారా తెగవారు జీవులన హింసిస్తున్నారని జంతు ప్రేమికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అనేక ఫిర్యాదుల తర్వాత పోలీసులు స్పందించారు. అయితే వారి జీవనాధారాన్ని దెబ్బతీయకుండా.. విషరహిత పాములనే పట్టుకుని జీవనం సాగించాలని అటవీ అధికారులు తెగ ప్రజలకు సూచించారు. స్థానిక సంప్రదాయాలను గౌరవించి ప్రభుత్వం కూడా అనుమతులు ఇస్తోందని అటవీ రేంజి అధికారి సియారామ్‌ కర్మాకర్‌ తెలిపారు.