Manipur : హననం, దాష్టీకం, క్రూరం..ఈ ఘోరాలకు ఏం పేరు పెడదాం?

తాజాగా మణిపూర్ లో జరుగుతున్న అకృత్యాలకు సంబంధించి మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాంగ్పోక్పి జిల్లాలో మొదటి ఘటన జరిగిన ప్రదేశానికి 40 కిలోమీటర్ల దూరంలోనే ఈ దారుణం చోటు చేసుకోవడం విశేషం.

Written By: Bhaskar, Updated On : July 23, 2023 5:14 pm
Follow us on

Manipur : పచ్చటి మణిపూర్ నెత్తుటి ధారను స్రవిస్తోంది.. హంసాకాండ మొదలై రెండు నెలలు దాటినప్పటికీ ఇంకా అక్కడ పరిస్థితి ఒక కొలిక్కి రాలేదు. ఎప్పుడు కుదుటపడుతుందో చెప్పలేకుండా ఉంది. మొన్న ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తాజాగా మణిపూర్ లో జరుగుతున్న అకృత్యాలకు సంబంధించి మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్త్రీలను వివస్త్రలను చేసి ఊరేగింపుగా తీసుకెళ్లి ఇద్దరిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన మే నాలుగవ తేదీ నాడే మరో దారుణం జరిగింది..కాంగ్పోక్పి జిల్లాలో మొదటి ఘటన జరిగిన ప్రదేశానికి 40 కిలోమీటర్ల దూరంలోనే ఈ దారుణం చోటు చేసుకోవడం విశేషం.
కార్ల సర్వీస్ షో రూంలో పనిచేస్తున్న ఇద్దరు కుకీ యువతులను తీవ్రంగా హింసించి, అఘాయిత్యానికి పాల్పడినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. జాతీయ మీడియా చెబుతున్న వివరాల ప్రకారం బాధితుల్లో ఒకరి వయసు 21 కాగా, మరొకరి వయసు 24. తూర్పు ఇంఫాల్ జిల్లా కొనుగు మామాంగ్ ప్రాంతంలోని షోరూంలో ఆ ఇద్దరు యువతులు ఉండగా.. వారిపై ఒక మూక దాడికి దిగింది. ఆ మూకలో మహిళలు.. గదిలోకి తీసుకెళ్లి యువతులపై అత్యాచారం చేయాలంటూ పురుషులను రెచ్చగొట్టారని ఆ షో రూమ్ లో పనిచేసే యువకుడు తెలిపాడు. అలా వారిపై రాక్షసక్రీడ జరిగిన తర్వాత దుస్తులు మొత్తం చినిగిపోయి, ఒళ్ళు మొత్తం రక్తంతో ఉన్న ఆ యువతులను బయటకు తీసుకొచ్చి కట్టెల మిల్లు సమీపంలో పడేశారు. అయితే ఈ ఘటనపై స్థానికులు ఆందోళన చెందారు. ఆ మూక వల్ల ఏర్పడిన భయంతో తొలుత ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదు. ఎవరికి ఓ యువతీ తల్లి ధైర్యం చేసి మే 16న సైకుల్ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు జీరో ఎఫ్ ఐ ఆర్ కింద కేసు నమోదు చేశారు. ఈ ఎఫ్ఐ ఆర్ ను ఫోరం పాట్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారని, దానిని మేము చూశామని ఇంగ్లీష్ మీడియా సంస్థ పేర్కొనడం విశేషం. ఆ యువతులపై 100 నుంచి 200 మంది దాడికి దిగారని, వారి వస్తువులు ఎక్కడున్నాయో కూడా దొరకలేదని, వారి మృతదేహాలు కూడా లభ్యం కాలేదని ఎఫ్ ఐ ఆర్ లో ఉంది. తన స్నేహితురాళ్ళను అంబులెన్సులో తరలించారని.. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో చనిపోయిందని మరో యువతి తెలిపింది.
కాగా మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటనపై సైకుల్ స్టేషన్లోనే తాజా ఊదంతా పై ఆర్ నమోదయింది. ఈ కేసులో నిందితులను పోలీసులు ఇంతవరకు పట్టుకోలేదు. మరోవైపు ఎంతమంది గిరిజన యువతులు కొనుంగ్ మామాంగ్ లోని అద్దం ఇంట్లో ఉండగా మూకదాడికి దిగి, అత్యాచారానికి పాల్పడ్డారని అనంతరం దారుణంగా హత్య చేశారని ఓ యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపిసి 153ఏ, 398, 446, 448 సెక్షన్లతోపాటు ఆయుధాల చట్టం కింద నిందితులపై కేసులు నమోదు చేసినప్పటికీ.. సామూహిక అత్యాచారం, హత్య కింద ఎలాంటి కేసులూ పెట్టలేదు.
ఇక ఇవి ఇలా ఉంటే వృద్ధురాలు అని చూడకుండా స్వాతంత్ర సమరయోధుడి భార్యను సజీవ దహనం చేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. మణిపూర్ రాజధాని ఇంఫాల్ కు 45 కిలోమీటర్ల దూరంలోని సేరో గ్రామంలో కొందరు దుండగులు 30 ఏళ్ల వృద్ధురాలు ఇంటికి నిప్పు పెట్టి ఆమెను సజీవ దహనం చేసినట్టు వెలుగులోకి వచ్చింది. ఈ ప్రాంతంలో మే నెలలో పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగాయి. ఇదే నెల 28న తెల్లవారుజామున ఇబే తోంబి (80) అనే మహిళ ఇంటికి ఆందోళనకారులు నిప్పు అంటించారు. అయితే ఇల్లు మొత్తం తగలబడి పోతుండగా.. ఆ వృద్ధురాలు తన కుటుంబ సభ్యులను బయటకు పంపించి.. ఆమె మాత్రం అందులో చిక్కుకుపోయింది. ఆ మంటల తాకిడికి సజీవ దహనమైంది. ఆమె మనవడికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఇక మృతురాలి భర్త తురా చంద్ సింగ్ స్వతంత్ర సమరయోధుడు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా అప్పట్లో అవార్డు అందుకున్నాడు.
ఇక మణిపూర్ రాజధాని ఇంపాల్ లో గొడవలు తగ్గడం లేదు. మహిళ నిరసనకారులు రోడ్లను దిగ్బంధించారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు. భాష్పవాయు గోళాలను ప్రయోగించి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ఇంపాల్ లోని పలు ప్రాంతాల్లో ప్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఇక ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటనలో మరొక నిందితుడిని (19) పోలీసులు అరెస్టు చేసినట్టు వార్తలు వస్తున్నాయి.