https://oktelugu.com/

Sitara: ‘సితార’ కాబోయే స్టార్ హీరోయిన్.. మహేష్ కు ఎలాంటి భయాలు లేవు.. ఫ్యాన్స్ సీరియస్ !

Sitara: మహేష్ బాబు గారాలపట్టి ‘సితార’ ఏమి చేసినా క్యూట్ గానే ఉంటుంది. తన లేలేత పలుకులతో ముద్దు ముద్దు చేష్టలతో సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. చిన్న వయసులోనే యూట్యూబ్ వీడియోలు చేస్తూ స్టార్ కిడ్స్ లోనే క్రేజీ ఫాలోయింగ్ తో సితార నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది. ఐతే, తొమ్మిదేళ్ల సితార పాప ‘సర్కారు వారి పాట’ కోసం ఒక స్పెషల్ సాంగ్ లో తన డ్యాన్స్ తో రంగప్రవేశం చేసింది. […]

Written By:
  • Shiva
  • , Updated On : April 23, 2022 / 01:45 PM IST
    Follow us on

    Sitara: మహేష్ బాబు గారాలపట్టి ‘సితార’ ఏమి చేసినా క్యూట్ గానే ఉంటుంది. తన లేలేత పలుకులతో ముద్దు ముద్దు చేష్టలతో సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. చిన్న వయసులోనే యూట్యూబ్ వీడియోలు చేస్తూ స్టార్ కిడ్స్ లోనే క్రేజీ ఫాలోయింగ్ తో సితార నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది.

    Sitara

    ఐతే, తొమ్మిదేళ్ల సితార పాప ‘సర్కారు వారి పాట’ కోసం ఒక స్పెషల్ సాంగ్ లో తన డ్యాన్స్ తో రంగప్రవేశం చేసింది. సితార డ్యాన్స్ చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. కాబోయే స్టార్ హీరోయిన్ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఐతే, కొంతమంది మహేష్ ఫ్యాన్స్ ‘సితార’ ఇప్పటి నుంచే లిమిట్స్ లో ఉంటే బాగుంటుంది అంటూ ఉచిత సలహాలు కూడా ఇచ్చారు.

    Also Read: Tollywood Super Hit Film: తెలుగు లో సూపర్ హిట్.. హిందీ లో భారీ డిజాస్టర్.. మొదటి రోజు వచ్చిన వసూళ్లు ఎంతో తెలుసా.??

    Sitara

    ఐతే నేషనల్ మీడియాకు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నమ్రత, తన కూతురు ‘సితార’ పై క్రేజీ కామెంట్స్ చేసింది. ఇంతకీ సితార గురించి నమ్రత చేసిన పలు ఆసక్తికరమైన కామెంట్స్ ను.. ఆమె మాటల్లోనే విందాం. ‘సితార పాప విషయంలో మహేష్ కు, అలాగే నాకు ఎలాంటి భయాలు లేవు. సితార ఇంట్రెస్ట్ ను మేము ప్రోత్సహిస్తునందుకు సంతోషిస్తున్నాం. అందరికీ తెలుసు. ఇప్పుడు సితారకు కేవలం తొమ్మిదేళ్లు మాత్రమే.

    Sitara

    ఈ వయసులో పిల్లలకు సరైన గైడెన్స్ అవసరం. అలాగే కొంత ఫ్రీడమ్ కూడా. కాకపోతే, ఈ ఫ్రీడమ్ కొన్ని పరిమితులతో ఉంటుంది. పైగా మా సితార పాపకు ఏది మంచి ? ఏది చెడు ? ఎక్కడ ఎలా ఉండాలి ? ఎవరితో ఎలా ప్రవర్తించాలి ? లాంటి విషయాలను నేను, మహేష్ ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటాం. సితారకు మా నుంచి అన్ని విషయాల్లో ఫుల్ సపోర్ట్ ఉంటుంది.

    Sitara

    నిజానికి సితార చాలా క్లవర్. ఏం చేయాలి ? ఏం చేయకూడదు ? అనే విషయాల్లో తను ఎంతో క్లారిటీగా ఉంటుంది. ఎప్పుడూ సితార తన హద్దులలోనే ఉంటుంది. తన లిమిట్స్ ను సితార ఎప్పుడు క్రాస్ చేయదు’ అంటూ నమ్రత చెప్పుకొచ్చారు. ఐతే, కొందరు మహేష్ ఫ్యాన్స్ మాత్రం ‘పిల్లలను పెంచే పద్ధతి ఇది కాదు’ అంటూ ఈ విషయంలో సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు.

    Sitara

    నిజానికి మహేష్ బాబు అభిమానులకు.. మహేష్ సూపర్ స్టార్ అయినా, ఎంతో అభిమానం ఉన్నా.. మహేష్ కుమార్తె, ఆయన గారాలపట్టి సితార అన్నా కూడా వారికి అంతే అభిమానం. అందుకే.. వాళ్ళు సితారను తమ మనిషిగా భావిస్తారు.

    Sitara

    ఇక సితార ఫుల్ ఎనర్జిటిక్.. మహేష్ తో సరదాగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. పైగా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ.. తనకంటూ అప్పుడే సెపరేట్ ఫాలోయింగ్ తెచ్చుకుంది.

    Also Read:KGF Mother: తెలుగు హీరోలపై ‘కేజీఎఫ్ మదర్’ ఆసక్తికర కామెంట్స్..!

    Tags