https://oktelugu.com/

Tollywood Super Hit Film: తెలుగు లో సూపర్ హిట్.. హిందీ లో భారీ డిజాస్టర్.. మొదటి రోజు వచ్చిన వసూళ్లు ఎంతో తెలుసా.??

Tollywood Super Hit Film: రోజు రోజు కి మన టాలీవుడ్ సినిమాలకు ఇతర రాష్ట్రాల్లో క్రేజ్ ఎలా పెరిగిపోతూ వెళ్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..మన సినిమాలు అన్నా మన హీరోలు అన్నా ఇతర రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది..ముఖ్యంగా బాలీవుడ్ ఆడియన్స్ కి మన సౌత్ సినిమాల పిచ్చి పట్టేసింది..అక్కడి ఆడియన్స్ కి వాళ్ళ నేటివిటీ కి తగ్గ సినిమాలకంటే మన సౌత్ సినిమాలే ఎక్కువగా నచ్చుతున్నాయి..అందుకే అక్కడి స్టార్ హీరోలు సైతం సౌత్ సినిమాలను రీమేక్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 23, 2022 / 01:40 PM IST
    Follow us on

    Tollywood Super Hit Film: రోజు రోజు కి మన టాలీవుడ్ సినిమాలకు ఇతర రాష్ట్రాల్లో క్రేజ్ ఎలా పెరిగిపోతూ వెళ్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..మన సినిమాలు అన్నా మన హీరోలు అన్నా ఇతర రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది..ముఖ్యంగా బాలీవుడ్ ఆడియన్స్ కి మన సౌత్ సినిమాల పిచ్చి పట్టేసింది..అక్కడి ఆడియన్స్ కి వాళ్ళ నేటివిటీ కి తగ్గ సినిమాలకంటే మన సౌత్ సినిమాలే ఎక్కువగా నచ్చుతున్నాయి..అందుకే అక్కడి స్టార్ హీరోలు సైతం సౌత్ సినిమాలను రీమేక్ చెయ్యడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు..ఎంతో కాలం నుండి సరైన హిట్ లేకుండా ఇబ్బంది పడుతున్న షాహిద్ కపూర్ కి తెలుగు లో సెన్సషనల్ హిట్ గా నిలిచినా విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాని కబీర్ సింగ్ పేరు తో రీమేక్ చేసి బాలీవుడ్ లో రికార్డ్స్ ని తిరగరాసాడు..ఆ సినిమా తన కెరీర్ కి ఆ స్థాయిలో బ్రేక్ ఇవ్వడం తో షాహిద్ కపూర్ తెలుగు లో ఆల్ టైం క్లాసిక్ సినిమాలలో ఒక్కటిగా నిలిచినా న్యాచురల్ స్టార్ నాని జెర్సీ సినిమాని రీమేక్ చేసాడు.

    Jersy

    జెర్సీ సినిమా బాగుంటుంది కాబట్టి ఈ సినిమా కూడా కబీర్ సింగ్ లాగానే సెన్సషనల్ హిట్ అయ్యి షాహిద్ కపూర్ కెరీర్ లో మరో ల్యాండ్ మార్క్ లాంటి హిట్ అవుతుంది అని అందరూ అనుకున్నారు..కానీ ఈ సినిమాకి మొదటి రోజు వచ్చిన వసూళ్లు చూసి బెంబేలెత్తిపోయారు ఆ చిత్ర నిర్మాతలు..KGF మేనియా ప్రభావం ఈ సినిమా పైన గట్టిగ పడిందో ఏమో తెలీదు కానీ మొదటి రోజు ఈ సినిమాకి కేవలం 3 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు మాత్రమే వచ్చాయి..మన టాలీవుడ్ నుండి హిందీ కి దబ్ అయినా సినిమాలు కూడా ఇంతకంటే ఎక్కువ వసూళ్లు రాబడుతాయి అని చెప్పొచ్చు..రేటింగ్స్ కూడా ఈ సినిమాకి ఎవ్వరు ఊహించని విధంగా చాలా తక్కువ వచ్చాయి..దీనిని బట్టి చూస్తుంటే బాలీవుడ్ ఆడియన్స్ మరియు క్రిటిక్స్ సౌత్ ఇండస్ట్రీ మాస్ సినిమాలకి బాగా అలవాటు పడ్డారు అనే చెప్పాలి..వరుసగా పుష్ప , #RRR మరియు KGF లాంటి సినిమాలు చూసిన తర్వాత ఒక్క క్లాస్ సినిమాని చూడడం వాళ్లకి ఏ మాత్రం ఇష్టం లేనట్టు
    ఉంది అని దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.

    Jersy

    Also Read: Hero Yash: KGF 2: యశ్ కి ఆ హీరోయిన్ అంటే పిచ్చి.. యశ్ షాకింగ్ కామెంట్స్ !

    ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని..ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ మరియు సూర్య దేవర నాగ వంశి కలిసి సంయుక్తంగా నిర్మించారు..ఎన్నో ఆశలతో బాలీవుడ్ కి అడుగుపెట్టిన దిల్ రాజు కి ఈ సినిమా ద్వారా చేదు అనుభవం ఎదురు అయ్యింది అనే చెప్పాలి..సినిమా లో కంటెంట్ ఉన్నప్పటికీ..KGF సునామి ముందు నిలబడలేకపోయింది..ఈ సమయం లో కాకుండా ఇంకా వేరే ఎప్పుడైనా ఈ సినిమాని విడుదల చేసుకొని ఉంటె కాస్త మంచి వసూళ్లు వచ్చేవి అని ట్రేడ్ పండితుల అభిప్రాయం..మొదటి రోజు కలెక్షన్స్ పక్కన పెడితే..కనీసం వీకెండ్ లో అయినా ఈ సినిమా పైకి లేస్తుందో లేదో చూడాలి..కబీర్ సింగ్ వంటి సెన్సషనల్ హిట్ తర్వాత షాహిద్ కపూర్ నుండి వస్తున్నా సినిమా కాబట్టి..ఈ మూవీ మినిమం గ్యారంటీ ఓపెనింగ్ వస్తుంది అని నిర్మాతలు కూడా భావించారు..కానీ వారి అంచనాలను తలకిందులు చేసింది ఈ సినిమా..డిసాస్టర్ ఓపెనింగ్స్ తో ప్రారంభం అయినా ఈ సినిమా..ఫుల్ రన్ లో ఎంత వసూలు చేస్తుందో చూడాలి.

    Also Read: Pawan Kalyan Rythu Bharosa Yatra: భరోసా యాత్రతో బాధితులకు భరోసా నింపిన పవన్

    Recommended Videos:

    Tags