Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా చాలా విజయాలను అందుకొని ఇప్పటికే సినిమాలపరంగా ఈ జనరేషన్ లో ఉన్న ఏ హీరోకి సాధ్యం కాని విధంగా చాలా ప్రయోగలు చేసి మంచి విజయాలను అందుకొని కొన్ని సినిమాల ద్వారా ఫెయిల్యూర్ లను కూడా ఎదుర్కొని మరి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు…ఈయన సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ అనతి కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకొని ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎదిగాడు…
ప్రస్తుతం ఈయన గురూజీ త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంది సంక్రాంతి కానుకగా 2024 సంక్రాంతి కి ఈ సినిమా రాబోతుంది. ఇక ఈ సినిమా తర్వాత ఈయన దర్శక ధీరుడు రాజమౌళి తో ఒక పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం రాజమౌళి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇక ఇలాంటి టైంలో మహేష్ బాబు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా గుంటూరు కారం సినిమాని పూర్తి చేసుకొని రాజమౌళి సినిమాలో జాయిన్ అయి పోవాలని చూస్తున్నాడు.
ఇక ఇదే టైంలో ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు చేస్తారు అనేది ఇంకా ఫిక్స్ కాకపోవడం వల్ల ప్రస్తుతం ఒక హీరోయిన్ ని మహేష్ బాబు ఈ సినిమా కోసం రాజమౌళికి రికమెండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ హీరోయిన్ ఎవరు అంటే మహేష్ బాబుతో శ్రీమంతుడు లాంటి ఒక సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్ గా చేసిన శృతిహాసన్ ని ఈ సినిమా కోసం హీరోయిన్ గా మహేష్ బాబు రికమెండ్ చేస్తున్నాడు ఇక వీళ్ల కాంబోలో ఇంతకుముందు వచ్చిన శ్రీమంతుడు సూపర్ హిట్ అవడంతో వీళ్ల కాంబోకి జనాల్లో మంచి క్రేజ్ ఉంది. దానికి తోడు వీళ్లిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి దానికోసమే మహేష్ బాబు, శృతిహాసన్ ని రిఫర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విషయం మీద రాజమౌళి ఎలా స్పందిస్తాడు అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే రాజమౌళి ఆల్రెడీ బాలీవుడ్ కు చెందిన హీరోయిన్ ని ఈ సినిమా కోసం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. బాలీవుడ్ కి సంబంధించిన హీరోయిన్ ని పెట్టుకోవడంలో రాజమౌళి ఉద్దేశ్యం ఏంటంటే బాలీవుడ్ కి సంబంధించిన హీరోయిన్ ఉంటే అక్కడ కూడా ఈజీగా మార్కెట్ అవుతుందనేది రాజమౌళి స్ట్రాటజీ…
రాజమౌళి ఎప్పుడు సినిమా తీసినా కూడా మార్కెటింగ్ పరంగా బాగా ఆలోచించి సినిమాకు ఎవరిని పెడితే ఎంత ఎక్కువ బిజినెస్ అవుతుంది అనే విషయాలను ఆలోచించి అందులో నటినటులను కూడా తీసుకుంటారు. అందుకోసమని ఇప్పటికే రాజమౌళి బాలీవుడ్ హీరోయిన్ పైన కన్నేసినట్టుగా తెలుస్తుంది. మహేష్ బాబు చెప్పినట్టుగా శృతిహాసన్ ని తీసుకుంటారా లేదా బా హీరోయిన్ ని తీసుకుంటారా అనేది తెలియాలంటే ఇంకొక కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు… అయితే ఇంతకుముందు కూడా మహేష్ బాబు చేసిన ఆగడు సినిమాలో ఐటెం సాంగ్ కోసం శృతిహాసన్ ని రిఫర్ చేశాడు. ఇప్పుడు ఈ సినిమా కోసం తనని రిఫర్ చేయడం చూస్తున్న జనాలు వీళ్లిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉందని అభిప్రాయ పడుతున్నారు…ఇక ఇప్పటికే ప్రభాస్ హీరో గా పాన్ ఇండియా సినిమా గా వస్తున్న సలార్ సినిమా లో కూడా హీరోయిన్ గా నటిస్తుంది…