Skanda Movie : భారీ మాసిజాన్ని చూపించే డైరెక్టర్లలో బోయపాటి శ్రీను ఒకరు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గాను పేరు తెచ్చుకున్న ఆయన సినిమాలో నటించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయన సినిమాలో ఛాన్స్ వస్తే ఎవరూ వదులుకోరు. నందమూరి బాలకృష్ణ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లను మాస్ హీరోలు అని చూపించిన బోయపాటి తాజాగా ‘స్కంధ’ సినిమాతో థియేటర్లోకి తీసుకొచ్చాడు. రామ్ పోతినేని హీరోగా నటించిన ఇందులో శ్రీ లీల హీరోయిన్ గా కనిపించి అలరించింది. రామ్ పోతినేని మరోసారి మాస్ హీరో అని ఈ సినిమా ద్వారా నిరూపించుకున్నాడు. ఈ మూవీలో రామ్ చెల్లెలుగా ఓ అందమైన భామ అలరిస్తుంది. ఇంతకీ ఆమె ఇదివరకే పాపులారిటీ తెచ్చుకున్న అమ్మాయి. ఆమె ఎవరో తెలుసా?
బోయపాటి శ్రీను సినిమాలో మాసిజం మాత్రమే కాకుండా సెంటిమెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది. బంధాలు, బంధుత్వాలు, సాంప్రదాయాలు ఆయన సినిమాలో కచ్చితంగా కనిపిస్తాయి. ఈ క్రమంలో ‘స్కంధ’ మూవీలో కూడా చెల్లెలి సెంటిమెంట్ తో ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించాడు. అయితే రామ్ చెల్లెలుగా నటించిన ఈ అందమైన అమ్మాయి ఎవరా? అని అందరూ ఆరా తీస్తున్నారు. కానీ ఆమె ఇప్పటికే సోషల్ మీడియాలో ఫేమస్ అయిన గర్ల్.
ఈ అమ్మాయి పేరు అమృతా చౌదరి. ఏపీలోని భీమవరంలో జన్మించిన ఈమె హైదరాబాద్ లో ఇంజనీరింగ్ ను కొనసాగిస్తూనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. పలు షార్ట్ ఫిలింలో నటించి ఆకట్టుకుంది. ఆ తరువాత పలు పాటలకు డ్యాన్స్ చేసిన వీడియోలను ఇన్ స్ట్రాగ్రామ్ లో ఉంచడంతో విపరీతంగా అభిమానులు పెరిగారు. ఆమె ఇన్ స్ట్రాగ్రామ్ ను 6 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో ఆమెను చూసిన బోయపాటి ‘స్కంధ’ సినిమాలో అవకాశం ఇచ్చారు. అయితే హీరోయిన్ రేంజ్ లో ఉన్న త్వరలో మంచి అవకాశాలు తెచ్చుకుంటుందని అనుకుంటున్నారు.
‘స్కంధ’ సినిమా సెప్టెంబర్ 28న థియేటర్లోకి వచ్చింది. విడుదలైన రెండు రోజుల్లోనే ఈ మూవీ రూ.27 కోట్ల గ్రాస్ చేసినట్లు సమాచారం. వీకెండ్ డేస్ రావడంతో కలెక్షన్ మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అఖండ విజయం తరువాత బోయపాటి చేసిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ రావడం విశేషం.